సినిమాలకు దూరం అవుతున్న డైరెక్టర్స్.. కొత్త సినిమా ఊసే లేదే?

సాధారణంగా ఒకసారి దర్శకుడి గా కెరీర్ మొదలు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు వరుస సినిమాలు తీయాలని ఆశపడుతుంటారు అన్న విషయం తెలిసిందే.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న దర్శకులు ఎంతో మంది.

 Why These Directors Far Away From Movies Srinuvaitla Venu Sri Ram Sujith Bommari-TeluguStop.com

కానీ కొంతమంది దర్శకులు మాత్రం మొదటి సినిమా తర్వాత ఇంకా మరో అడుగు వేయలేకపోతున్నారు.ఏళ్లు గడుస్తున్నా దర్శకుడి నుంచి కొత్త సినిమా రావడం లేదు అని చెప్పాలి.

అలాంటి దర్శకుల వివరాలు తెలుసుకుందాం.

ప్రభాస్ సాహో సినిమా తెరకెక్కించిన దర్శకుడు సుజిత్ ఇక సాహో సినిమా తర్వాత మాత్రం ఇంతవరకు మరో ప్రాజెక్టుని పట్టాలెక్కించలేదు.

మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.ఇక అచ్చం సుజిత్ లాగానే ప్రభాస్ తో భారీ అంచనాల మధ్య రాధేశ్యామ్ సినిమా తీసి బ్లాక్ డీలాపడ్డ రాధాకృష్ణ కుమార్ సైతం మరో ప్రాజెక్టు వైపు అడుగులు వేయలేదు అని చెప్పాలి.

ఫ్లాప్ వచ్చిన దర్శకులకే కాదు.హిట్ ఇచ్చిన దర్శకులకు కూడా అవకాశాలు దక్కడం లేదు బంగార్రాజు చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు కళ్యాణ్ కృష్ణ. తర్వాత సినిమా ఏమిటన్నది మాత్రం ఇప్పటికీ చెప్పలేకపోతున్నాడు ఈ దర్శకుడు.

Telugu Sujith, Directors, Kalyan Krishna, Kishor Tirumala, Radha Krishna, Srinu

అక్కినేని హీరో అఖిల్ కు సూపర్ హిట్ అందించ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మరోసారి కం బ్యాక్ అయిన బొమ్మరిల్లు భాస్కర్ ఆ తర్వాత మరో సినిమా కోసం ఆలోచన చేయలేదు అని తెలుస్తుంది.ఒకప్పుడు హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ శ్రీనువైట్ల సైతం కొన్నేళ్ల నుంచి సైలెంట్ అయిపోయారు.రవితేజ తీసిన అమర్-అక్బర్-ఆంటోని తర్వాత ఇప్పుడు వరకు కొత్త సినిమా తో ముందుకు రాలేదు.

Telugu Sujith, Directors, Kalyan Krishna, Kishor Tirumala, Radha Krishna, Srinu

ఇక అల్లుడు అదుర్స్ సినిమా తర్వాత దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ నుంచి కూడా కొత్త మూవీ అప్డేట్ లేకపోవడం గమనార్హం.పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తీసిన వేణు శ్రీరామ్, భీమ్లా నాయక్ తర్వాత సాగర్ చంద్ర కూడా బిజీ అవ్వలేకపోయారు అని చెప్పాలి.ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా తర్వాత దర్శకుడు తిరుమల కిషోర్ సైతం ఇప్పటివరకు కొత్త మూవీ అప్డేట్ ఇవ్వలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube