హుస్సేన్ రాణా( Hussain Rana )… ఈ వ్యక్తి మీకు గుర్తున్నాడా? ఆ పేరుని భారతీయులు మర్చిపోవడం దాదాపుగా అసాధ్యం.ఎందుకంటే ఆనాడు డెన్మార్క్ లోని తన స్నేహితుడు డేవిడ్ కోల్‌మన్ హెడ్లీతో కలిసి హుస్సేన్ రాణా ముంబయి దాడికి కుట్ర పన్నారు.
ఈ ఆరోపణలపై హుస్సేన్ రాణాను అమెరికాలో దోషిగా తేల్చారు.ఈ క్రమంలో 2008 ముంబయి దాడుల కేసులో ‘తహవ్వూర్ హుస్సేన్ రాణా’ ( Tahavvoor Hussain Rana )అమెరికాలో గత కొన్నేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు.
ఇక ఎట్టకేలకు హుస్సేన్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అక్కడి కోర్టు ఆమోదం తెలపడం హరించదగ్గ విషయం.
రాణా పాకిస్తాన్‌లో జన్మించిన కెనడా పౌరుడు( Canada ).రాణాను అప్పగించాలని గతంలో భారత ప్రభుత్వం అమెరికాను ఎన్నోసార్లు కోరింది.ముంబై దాడుల నేపథ్యంలో అమెరికా కోర్టు అతనికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
అయితే 62 ఏళ్ల తహవ్వూర్ హుస్సేన్ రాణా అమెరికా ( America )నిర్ణయంపై అప్పీల్ చేస్తారా, లేదా అనే వివరాలు తెలియదు.అంతేకాకుండా ప్రస్తుతం రాణాను ఎప్పుడు భారత్‌కు రప్పిస్తారనే విషయంలో స్పష్టత రావలసి వుంది.
ఇకపోతే 2008 నవంబర్ 26న రాత్రి 10 మంది ఉగ్రవాదులు ముంబయిలోని పలు భవనాలపై ఏక కాలంలో దాడి చేయడం జరిగింది.రెండు ఫైవ్ స్టార్ హోటళ్లు, ఓ హాస్పిటల్, రైల్వే స్టేషన్లు, యూదుల కేంద్రాన్ని టార్గెట్ చేసిన దాడిలో పలువురు విదేశీయులు సహా 164 మంది చనిపోయారు.దాంతో ఒక్కసారిగా ఇండియా కంపించింది.ఈ దారుణ ఘటన లో తహవ్వూర్ హుస్సేన్ ప్రధాన పాత్రదారుడు.