సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోలు రోజు రోజుకి వాళ్ల క్రేజ్ ను పెంచుకోవడానికి సక్సెస్ ఫుల్ సినిమాలు చేయడానికి సక్సెస్ ఫుల్ దర్శకులతో సినిమాలు సెట్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అలా మొత్తానికి ఏదో ఒకటి చేసి సక్సెస్ కొట్టడం అనేది వాళ్లకి చాలా అవసరం అని చెప్పాలి.
ఎందుకంటే ఒక హీరో సినిమా ఫ్లాపయితే ఇంకో హీరో సినిమా హిట్ చేసుకొని ముందుకు దూసుకెళ్తూ ఉంటాడు.కాబట్టి ఇక్కడ పోటీ అనేది ఉంటుంది అనే చెప్పాలి వాళ్లని వాళ్లు ప్రూవ్ చేసుకోవడానికి చాలా మంది హీరోలు చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
ఇందులో భాగంగానే అప్పట్లో తెలుగులో ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు లాంటి అగ్ర హీరోలు అందరూ స్టార్ హీరోలు గా ఎదిగిన వారే అనే విషయం మనందరికీ తెలిసిందే.
తెలుగులో ఎలాగైతే వీళ్ళందరూ స్టార్ హీరోలుగా గుర్తింపు పొందారో తమిళంలో కూడా ఎం జి ఆర్, శివాజీ గణేషన్ లాంటి హీరోలు స్టార్ హీరోలుగా వెలుగొందిన విషయం మనకు తెలిసిందే అయితే తమిళంలో విలన్ పాత్రలు పోషించే ఎం.
ఆర్ రాధా గురించి చాలా మందికి తెలియదు.ఆయన ఎవరు అంటే హీరోయిన్ రాధిక వాళ్ళ నాన్న ఎం.ఆర్.రాధా గురించి మాట్లాడుకోవాలంటే ఆయన చాలా సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు.అందులో భాగంగానే ఆయన ఒకరోజు ఎంజీఆర్ ఉన్న ఇంటికి వెళ్లి ఆయన్ను బయటకు రమ్మని పిలిచారు.క్యాజువల్ గా మాట్లాడడానికి వచ్చాడు కావచ్చు అనుకుని ఎం జి ఆర్ ఎం ఆర్ రాధ పిలవగానే బయటికి వచ్చాడు ఎంజీఆర్ బయటకు వచ్చి ఆయనతో మాట్లాడుతుంటే ఆయన జేబులో నుంచి గన్ తీసి ఎంజీఆర్ ను కాల్చివేశాడు.
అలా ఎందుకు కాల్చాడు ఏం జరిగింది అనే విషయం చాలా మందికి తెలియదు.మొత్తానికి అయితే ఎం జి ఆర్ ని హాస్పిటల్ లో వేయడం జరిగింది. అయితే ఆయన ఎందుకు కాల్చాడు అనే విషయం చాలా మందికి మిస్టరీగానే మిగిలిపోయింది.
కొంత మంది మాత్రం ఎం.
ఆర్.రాధా ఎంజీఆర్ ని కాల్చడం విషయంపై కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశారు అవి ఏంటి అంటే ముఖ్యంగా ఎంజీఆర్ సినిమాలో నటించినప్పుడు మాత్రం చాలా మంది తనకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని తను ఎక్కడికి వెళితే అక్కడ ఉండే జనాలు నమస్కరించాలనే కోరిక బలంగా ఉండేది తను వెళ్ళిన ప్రాంతంలో చాలామంది లేచి నిలబడి నమస్కరించాలి అని అనుకునే వాడు.అతని దృష్టిలో ఆయన గురించి ఒక అతీతమైన శక్తి కలవాడు అన్నట్టుగా ఉంచుకునేవారు దానివల్ల చాలామంది నమస్కరించే వారు నమస్కరించకపోతే ఎం జి ఆర్ వాళ్లని చూసి వాళ్లని అవకాశం వచ్చినప్పుడు ఛాన్సులు ఇవ్వకుండా చేసేవారు.
ఆయన అలా ఉండడం చాలామందికి నచ్చేది కాదు అందుకే ఎం జి ఆర్ ని ఎం.ఆర్.రాధా కాల్చడం జరిగింది.తను కాల్చి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎం జి ఆర్ ని కాల్చింది తనే అని చెప్పడం జరిగింది దాంతో కొన్ని రోజులు పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు.అలాగే ఆ తర్వాత కొన్ని రోజుల పాటు జైల్లో ఉండి వచ్చి మళ్లీ సినిమాల్లో నటించడం కూడా జరిగింది.
ఆ తర్వాత ఎం.ఆర్.రాధ కూతురు అయిన రాధిక సినిమాల్లో హీరోయిన్ గా వచ్చి తనకంటూ మంచి గుర్తింపు సాధించుకొని ఇండస్ట్రీలో అగ్రహీరోయిన్ గా చాలా కాలం పాటు కొనసాగింది ప్రస్తుతం శరత్ కుమార్ ని పెళ్లి చేసుకొని తన లైఫ్ ని లీడ్ చేస్తుందని చెప్పాలి ఇలా కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పడానికి ఎం.ఆర్.రాధా గారిని ఉదాహరణగా తీసుకోవచ్చు
.