వైరల్ వీడియో: పట్టాలు దాటుతూ ట్రైన్ కి బలైయిపోయిన మహిళ..!

ఈ మధ్య కాలంలో చాలామంది బయటకు వచ్చే సమయంలో వారి ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి చెవిలో ఇయర్ ఫోన్స్ వినియోగించడం మరీ ఎక్కువగా మారింది.ఒక్కోసారి ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం ద్వారా పక్కన ఏం జరుగుతుంది అన్న విషయాలు కూడా గుర్తుంచుకోకుండా రోడ్లపై నడిచేస్తుంటారు.

 While Train Track Crossing The Lady Has Dead, Viral Video, Social Media, Lady, T-TeluguStop.com

ఇలా చేయడం ద్వారా అనేక మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు.తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి మరొకటి పునరావృతం అయింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ఎవరి తప్పుకు వారే బాధితులు అని చెప్పుకునే ఎలా జరిగింది ఈ సంఘటన.

తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హోషంగాబాద్ రైల్వే క్రాసింగ్ దగ్గర ఈ దారుణ సంఘటన జరిగింది.ఓ మహిళ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ రైల్వే ట్రాక్ దాటడానికి ప్రయత్నించింది.

అయితే అదే సమయానికి ఆవిడ రైల్వే ట్రాక్ డేట్ సమయంలో ఓ రైలు వేగంగా వచ్చి ఆమె ప్రాణాలను బలికొంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫొటోస్ వీడియో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో పట్టాలకు అటువైపు నుంచి ఇటు వైపు వెళ్లడానికి అక్కడికి వచ్చిన వాహనదారులు ట్రైన్ ఎప్పుడు వచ్చి వెళ్తుందని ఎదురుచూస్తున్నారు.అయితే ఎంతకీ రైలు రాకపోవడంతో అంతలోనే ఓ మహిళ ట్రైన్ పట్టించుకోకుండా పట్టాలు దాటడం చేసింది.

రైల్వే గేట్లు దాటే సమయంలో చెవులకు ఇయర్ ఫోన్స్, చేతికి బ్యాగ్ వేసుకొని రైల్వే గేట్లను దాటి దూసుకపోయింది.ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం ద్వారా ఆమెకు బయటివైపు ఎలాంటి సౌండ్ వినిపించకడంతో ఈ దుర్ఘటన జరిగింది.

రైల్వే క్రాస్ లో మొత్తం మూడు రైలు పట్టాలు ఉండగా మొదటి రెండు రైలు పట్టాలను బాగానే దాటిన 3 రైల్వే ట్రాక్ దాటేటప్పుడు ట్రాక్ పై వచ్చే రైలు ను వస్తుందో లేదో అని గమనించకుండా దాటడానికి ప్రయత్నించింది.ఆ సమయంలో మూడో రైల్వే ట్రాక్ పై ట్రైన్ అతివేగంతో వెళ్తోంది.

ఆమె ట్రాక్ పై రావడాన్ని గమనించిన ట్రైన్ లోకో పైలెట్ కూడా హారన్ కొట్టిన కూడా ఆవిడ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల ఆవిడకు ఆ సౌండ్ వినిపించలేదు.ఇంకేముంది ఆ రైలు వచ్చి ఢీ కొట్టింది.

దీంతో ఆవిడ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube