ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్.వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ ఉంటుంది.
ఇక తాజాగా సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇంతకముందు యాప్ లో కొత్త ఫీచర్లను తీసుకొచ్చి యూజర్లను ఆకట్టుకున్న వాట్సాప్.
ఇప్పుడు డెస్క్‌టాప్ వెర్షన్ లోనూ కొత్త ఫీచర్లను అందిస్తుంది.తాజాగా వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్ లో వాయిస్ మెసేజ్ లను రికార్డ్ చేసేటప్పుడు వాటిని పాజ్ చేసి.
మళ్లీ వాటిని ప్రారంభించేందుకు వీలుగా ఓ ఫీచర్ ను యూజర్ల ముందుకు తీసుకురావడానికి పరీక్షిస్తోంది.ఇప్పటికే వాట్సాప్ బీటా ఇన్ఫో.
డెస్క్‌టాప్ బీటా వెర్షన్‌లో ఈ అప్‌డేట్‌ను గుర్తించింది.
ఇప్పుడు వాయిస్ మెసేజ్ పంపే ముందు పాజ్ తో పాటు వాయిస్ మెసేజ్ ప్రివ్యూ చేయడానికి కూడా మనకు వీలుగా ఉంది.
వాయిస్ మెసేజ్ పంపే ముందు గతంలో మనకు ఈ పాజ్ బటన్ కనిపించకపోయేది.ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్ యాప్ బీటా వెర్షన్‌లో సైతం అందుబాటులోకి వచ్చింది.
ఈ కొత్త బటన్ కొందరు యూజర్లకు ఇప్పటికే అందుబాటులోకి రాగా.ఇది ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదని వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకటించింది.
యూజర్లు ఎక్కువగా ఈ పాజ్ అండ్ ప్లే ఫీచర్ ను తీసుకురమ్మని అడిగారు.దీంతో వాట్సాప్ గతేడాది ఐఓఎస్ యాప్ బీటా వెర్షన్‌లకు ఈ పాజ్ అండ్ ప్లే ఫీచర్ ను పరిచయం చేసింది.
ఎక్కువ వాయిస్ మెసేజ్ లు పంపే టైం లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది.ఈ ఫీచర్ ద్వారా.
యూజర్లు రికార్డింగ్ చేసి వాటిని ఇతరులకు పంపే ముందు.వాటిని చెక్ చేయడానికి యూజర్లకు అనుమతిస్తుంది.
దీంతో డెస్క్ టాప్ యూజర్లకు వాయిస్ మెసేజ్‌లు పంపడం సులభతరం అయింది.