బోనాల ఉత్సవంలో పోతురాజు ఎందుకు ఉంటారో తెలుసా?

బోనాల పండుగ అంటేనే ఇంటి ఆడపడుచులు సాక్షాత్తు అమ్మవారిగా అలంకరించుకుని కొత్త కుండలో అమ్మవారికి బియ్యం, బెల్లం, పాలు కలిపి బోనం తయారు చేసి బోనం కుండకు పసుపురాసి వేపకొమ్మలు కట్టి దానిపై ఒక దీపం పెట్టుకొని బోనం ఊరేగింపుగా తీసుకొని అమ్మవారికి సమర్పించడాన్ని బోనం పెట్టడం అంటారు.అయితే ఈ పద్ధతి తెలంగాణాలో గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తోంది.

 What Is The Speciality Of Pothuraju In Bonalu Festival, Pothuraju, Bonalu, Bona-TeluguStop.com

పూర్వం భయంకరమైన వ్యాధి ప్రబలడం చేత పెద్దవారు అమ్మవారికి బోనం పెట్టి ఆ వ్యాధి నుంచి తమని కాపాడమని శరణువేడారని అప్పటి నుంచి భోజనం పెట్టడం ఆచారంగా వస్తోంది అని చెప్పవచ్చు.

ఈ విధంగా ఆషాడమాసంలో ముఖ్యంగా గ్రామ దేవతలకు బోనాలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

బోనాల పండుగ అంటేనే ఆడపిల్లల కోలాహలం, డబ్బుల శబ్దాలు, పోతరాజుల డాన్సులు చూడటానికి ఎంతో కను సొంపుగా ఉంటాయి.మరి అమ్మవారికి బోనాలు పెట్టేటప్పుడు పోతురాజు ఎందుకు ఉంటారు? బోనాల జాతరలో పోతరాజు ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

Telugu Bonalu, Bonalu Festival, Grama Devathalu, Maremma, Peddamma, Pochamma, Po

కేవలం బోనాలు పండుగ అని మాత్రమే కాకుండా ఏ జాతర ఏ కొలువు జరిగినా అక్కడ పోతురాజు తప్పనిసరిగా ఉండాలి.గ్రామ దేవతలైన పెద్దమ్మ, ఎల్లమ్మ, మారెమ్మ, పోచమ్మ వంటి దేవతలకు పోతురాజు తమ్ముడు.శివుని ఆజ్ఞ మేరకు పోతురాజు దేవతల కోటకు కావలిగా నిలుస్తాడు.

ఈ క్రమంలోనే ఏదైనా జాతర సమయంలో పోతురాజు ఒంటి నిండా పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టి, కాళ్ళకు గజ్జెలు కట్టి భయంకరమైన రూపంలో నృత్యం చేస్తూ ఉంటాడు.ఇక పోతురాజు చేతిలో ఉన్నటువంటి కొరడాలతో డాన్సులు చేస్తూ అమ్మవారికి ఊరేగింపుగా వెళ్తారు.

Telugu Bonalu, Bonalu Festival, Grama Devathalu, Maremma, Peddamma, Pochamma, Po

ఈ క్రమంలో పోతురాజు చేతిలో ఉన్నటువంటి కొరడా ఎవరికైతే తగులుతుందో వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని భావించి చాలా మంది భక్తులు పోతురాజు నమస్కారం చేయడానికి వెళ్తుంటారు.అదేవిధంగా ఊరేగింపుగా వెళ్తున్నటువంటి పోతురాజు కోడిని లేదా మేకపోతు మెడను కొరికి రక్తం తాగుతారు.దీనినే వాడుక భాషలో గావు పట్టడం అంటారు.ఆగ్రహంతో ఉన్న అమ్మవారు ఈవిధంగా రక్తాన్ని చూడటం వల్ల శాంత పడతారని పోతురాజుకు గావు పడుతుంటారు.పోతురాజు గ్రామదేవతలకు సోదరుడు కనుక అమ్మవారికి సమర్పించిన బోనాలలో తప్పని సరిగా పోతురాజు ఉండడం ఆనవాయితీగా వస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube