ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ( YSRCP ) అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు పూర్తి అయింది.ఈ నెల 30 నాటికి సిఎంగా జగన్మోహన్ రెడ్డి( CM Jagan Mohan Reddy ) ప్రమాణస్వీకారం చేసి నాలుగేళ్ళు పూర్తి చేసుకుంటారు.
మరి ఈ నాలుగేళ్లలో ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు.ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు.
గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి మద్య తేడా ఏంటి ఇలాంటి ప్రశ్నలు రాక మానవు.ఇక మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి వచ్చే ఎన్నికల్లో మాదే విజయమని జగన్మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నారు.
మరి నిజంగానే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అధికారం కట్టబెట్టిందుకు సిద్దంగా ఉన్నారా ? ప్రస్తుతం ఈ ప్రశ్నలన్నీ కూడా రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ డిబేట్లకు దారి తీస్తున్నాయి.
ఈ నాలుగేళ్లలో 98.4 శాతం ఇచ్చిన హామీలను నెరవేర్చమని జగన్ సర్కార్ చెబుతోంది.మరి నిజంగానే నెరవేర్చిందా అంటే సమాధానం చెప్పడం కష్టమే.
మేనిఫెస్టోలో( YCP Manifesto ) ప్రకటించిన హామీలను కూడా వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసిందనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది.సిపిఎస్ రద్దు చేస్తామని, ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని.
ఇలా చాలా హామీలనే ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
తీర అధికారంలోకి వచ్చిన తరువాత పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికి ప్రధానంగా ప్రకటించిన పై హామీల ఊసే లేదు.అయితే ఎన్నికల్లో ప్రకటించిన విధంగా ఎందుకు హామీలను నెరవేర్చడం లేదనే ప్రశ్న ఎదురైనప్పుడు అసలు ఆ హామీలు మా మేనిఫెస్టోలోనే లేవని దాటివేసే దొరణి అవలంభిస్తున్నారు వైసీపీ నేతలు.అయినప్పటికి 98 శాతం హామీలను నెరవేర్చమని వైసీపీ సర్కార్ చెప్పుకోవడం నిజంగా హాస్యాస్పదమే.
అంతే కాకుండా ఈ నాలుగేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు, నిత్యవసర ధరల పెరుగుదల, పెరిగిన బస్ చార్జీల పెంపు.
ఎలా ఎన్నో అధనపు భారాలు ప్రజలపై గట్టిగానే మోపింది జగన్ సర్కార్. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై సానుకూలత కంటే వ్యతిరేకతనే ఎక్కువగా ఎదురవుతోంది.అయితే అమ్మవొడి, చేయూత, సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా వంటి పథకాలతో లభ్ది పొందుతున్నవారితో పాటు వాలెంటర్లు, సచివాలయ ఉద్యోగులు వంటి వాళ్ళంతా కూడా జగన్ సర్కార్ పై కొంత సానుకూలంగానే ఉన్నారు.
దీంతో ఈ నాలుగేళ్లలో అటు అసంతృప్తిని.ఇటు సంతృప్తిని సమంగా మూటగట్టుకుంది జగన్ సర్కార్.మరి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఏపీ ప్రజలు ఎలాంటి ఫలితాలను ఇస్తారో చూడాలి.