జింకా మజాకా.. వాట్ ఏ జంప్.. భవనం ఎత్తు ఎగిరిన జింక.. వీడియో వైరల్..!

ఇంటర్నెట్ లో జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు అప్ లోడ్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని మనల్ని అబ్బురపరుస్తాయి.

 What A Jump  Deer Flying High In The Building Video Viral,  Dear Jump, Latest-TeluguStop.com

అలాంటి ఓ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో ఒక జింక ఏకంగా ఒక భవనం ఎత్తు ఎగిరి ఆశ్చర్యపరుస్తోంది.

దీన్ని చూసిన నెటిజనులందరూ “వావ్ వాట్ ఏ జంప్” అని కామెంట్ పెడుతున్నారు.లాంగ్ జంప్.

షార్ట్ జంప్ పోటీల్లో పాల్గొంటే అన్ని అవార్డులు దీనికే వస్తాయని మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.యాక్షన్ సినిమాలో లాగా భలే జంప్ చేసిందంటూ ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ వీడియోని వైల్డ్ లెన్స్ ఏకో ఫౌండేషన్ అనే ఓ ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది.ఈ వీడియోకి ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.

అలాగే వేలలో లైక్స్ వస్తున్నాయి.

వైరల్ అయిన వీడియోలో మనం ఒక జింక పిల్ల రహదారికి పక్క వైపు నుంచి వేగంగా దూసుకు రావడం చూడొచ్చు.

ఆ తర్వాత అది ఒక్క సారిగా రహదారిని అడ్డంగా దాటుతుండటం గమనించవచ్చు.అయితే అది రహదారి దాటుతున్న సమయంలో మామూలుగా నేలపై నడవకుండా గాల్లోనే తేలింది.దాదాపు 30 సెకండ్ల పాటు అది కనీసం పది అడుగుల ఎత్తులో లేదా ఒక చిన్న భవనం ఎత్తులో గాల్లోనే తేలుతూ కనిపించింది.చూడ్డానికి ఇది అద్భుతంగా అనిపించింది.

అందుకే నెటిజన్లు ” జింకా మజాకా.వాట్ ఏ జంప్.” అని దాన్ని పొగిడేస్తున్నారు.పక్షిలాగా దూకేసిన ఈ జింక అందర్నీ ఆకట్టుకుంటోంది.

ఇకపోతే గత నెలలో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పర్వీన్ కశ్వాన్ ఇలాంటి ఓ వీడియో నెటిజన్లతో పంచుకున్నారు.ఇలా కొన్ని ఒక గుంపు జింకలు చాలా ఎత్తులో ఎగురుతూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఈ జింక వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube