కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత కార్య వర్గమైన సిడబ్ల్యుసి సమావేశాలు( CWC Meeting ) హైదరాబాదులో మొదటిరోజు ముగిసాయి.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కీలక నాయకులు, రాష్ట్రాల అధ్యక్షులు ,సీఎల్పీ నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో మొదటి రోజు అనేక అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది.
బాజాపా ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, మణిపూర్ అల్లర్లు, జమిలి ఎన్నికలు , ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు వంటి విషయాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది.
సమావేశం ముగిసిన తర్వాత చిదంబరం, జైరాం రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు జమిలీ ఎన్నికలను( Jamili Elections ) కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని.
ఇది దేశ సమాఖ్య వ్యవస్థ పై భాజపా( BJP ) దాడిగా తాము భావిస్తున్నామంటూ వారు చెప్పుకొచ్చారు.జమలి ఎన్నికలకు ఆరు రాజ్యాంగ సవరణలు కావాలని వాటిని పాస్ చేసే సంఖ్యాబలం తమకు లేదని తెలిసినా కూడా భాజపా కేవలం కొన్ని సమస్యలను పక్కదారి పట్టించి ప్రజల దృష్టి వీటి వైపు ఉండటం కోసమే వీటిని ముందుకు తీసుకు వచ్చిందని,
ఒకవైపు చైనా ( China ) దేశ సరిహద్దుల్లోకి చొచ్చుకు వస్తుంటే చోద్యం చూస్తున్న మోదీ ,( PM Modi ) మరోసారి అధికారంలోకి రావడం కోసమే అనేక జిమ్మిక్కులు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం పెరగడం, ఎగుమతులు తగ్గిపోవడం ,దిగుమతులు భారం కావడం అనే అంశాలు భారత ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్నా కూడా ఇంకా ప్రజల ఎమోషన్స్ ను వాడుకుని మత విద్వేషాలను రెచ్చగొట్టే ఉద్దేశంలోనే భాజపా ఉందంటూ విమర్శించారు.
మొదటి రోజు మూడు తీర్మానాలు చేశామని అయితే అవన్నీ సంతాపాలకు సంబంధించినవేనని, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాంది మరణానికి సంతాపం గాను మణిపూర్ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన అభాగ్యుల మరణాలపై మరో తీర్మానం హిమాచల్ ప్రదేశ్ లో ప్రకృతి వైపరీత్యాల వల్ల చనిపోయిన వారి మృతికి మరో సంతాపాన్ని ప్రకటించినట్లుగా తెలుస్తుంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం గా రేపు జరగబోయే భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పలు కీలక హామీలను ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.