Narender Singh : 30 ఏళ్ల నాటి హత్య కేసు : యూఏఈలో హంతకుడు .. సీబీఐ , ఇంటర్‌పోల్‌ ఆపరేషన్‌తో భారత్‌కి నిందితుడు

ఇంటర్‌‌పోల్ ఛానెల్‌లను ఉపయోగించి సీబీఐ సాయంతో నిర్వహించిన ఆపరేషన్‌లో హత్య కేసులో పరారీలో వున్న భారతీయుడిని శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్( United Arab Emirates ) ( యూఏఈ) నుంచి స్వదేశానికి రప్పించినట్లు హర్యానా పోలీస్ అధికారులు తెలిపారు.1994 డిసెంబర్ 26న తోహానా పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్య కేసులో నరేందర్ సింగ్‌ను( Narender Singh ) హర్యానా పోలీసులు కోరారు.అతను కొడవలితో స్వరణ్ సింగ్( Swaran Singh ) అనే వ్యక్తిని నరికి చంపినట్లు తెలిపారు.1998లో ట్రయల్ కోర్ట్ అతడిని నిర్దోషిగా ప్రకటించగా.పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ 2009లో నిందితుడికి జీవితఖైదు విధించింది.నరేందర్ సింగ్ అదృశ్యమయ్యాడనే అనుమానంతో రాష్ట్ర పోలీసులు అతనిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని కోరుతూ సీబీఐని ఆశ్రయించారు.

 Wanted By Haryana Police Absconding Murder Convict With Interpol Notice Repatri-TeluguStop.com

Telugu Cbi, Haryana, Punjab Haryana, Swaran Singh, Arab Emirates-Telugu Top Post

హర్యానా పోలీసుల( Haryana Police ) అభ్యర్ధన మేరకు నవంబర్ 7, 2023న ఇంటర్‌పోల్ జనరల్ సెక్రటేరియట్ నుంచి సీబీఐ అతనిపై రెడ్ నోటీస్ జారీ చేసింది.నిందితుల లోకేషన్ , అరెస్ట్ కోసం ఇంటర్‌పోల్ సభ్యదేశాలకు నోటీసు పంపినట్లు సీబీఐ ప్రతినిధి తెలిపారు.ఇంటర్‌పోల్ ఛానెల్‌లను ఉపయోగించి సీబీఐ అతడిని యూఏఈలో గుర్తించినట్లుగా ఆయన పేర్కొన్నారు.ఇంటర్‌పోల్ ఎన్‌సీబీ అబుదాబీ, హర్యానా పోలీసులు, అబుదాబీలోని భారత రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రెడ్ నోటీస్‌తో సమన్వయం చేయబడిన సీబీఐ గ్లోబల్ ఆపరేషన్స్ సెంటర్‌లు( CBI Global Operations Centres ) ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

Telugu Cbi, Haryana, Punjab Haryana, Swaran Singh, Arab Emirates-Telugu Top Post

ఇంటర్‌పోల్ ఛానెల్‌ల ద్వారా విదేశీ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలతో సన్నిహిత సమన్వయం , ఫాలోఅప్ కారణంగా 2023లో భారతీయ చట్ట అమలు సంస్థలకు కావాల్సిన 29 మంది నేరస్థులను విదేశాల నుంచి తీసుకొచ్చారు.నేరస్థులపై సీబీఐ.ఇంటర్‌పోల్ ద్వారా 100 రెడ్ నోటీసులను జారీ చేసింది.అంతేకాకుండా ఇంటర్‌పోల్ మెకానిజమ్‌లను కూడా సీబీఐ సమీకరించింది.స్టార్ గ్లోబల్ ఫోకల్ పాయింట్ నెట్‌వర్క్, ఫైనాన్షియల్ క్రైమ్ అనాలిసిస్ ఫైల్స్ వంటి ఛానెల్స్ ద్వారా ఆర్ధిక నేరగాళ్ల ఆదాయాన్ని చెదరగొట్టడం, గుర్తించడం వంటి చర్యలు తీసుకుంది.షెల్ కంపెనీలు, మోసపూరిత లావాదేవీలు, మనీ మ్యూల్స్‌కు పాల్పడిన నిందితుల క్రిమినల్ ఇంటెలిజెన్స్‌ను రూపొందించడం ద్వారా వారికి మద్ధతుగా వున్న నెట్‌వర్క్‌లను విడదీస్తుంది.

దీని వల్ల లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు తగిన చర్యలు తీసుకోవడానికి ఇంటర్‌పోల్ ద్వారా సమాచారం అందించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube