రష్యా భవిష్యత్తు సైనికుల భుజస్కందాలపైనే ఆధారపడి వుంది: వ్లాదిమిర్‌ పుతిన్‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌( Vladimir Putin ) తన సైనికులను యుద్ధం దిశగా మరింత ప్రత్సాహించే పనిలో పడ్డాడు.తాజాగా ఆయన మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌ విక్టర్‌ డే పరేడ్‌లో( Victory Day Parade ) మాట్లాడుతూ.

 Vladimir Putin Delivers Speech At Victory Day Parade Details, Telugu Nri, Lates-TeluguStop.com

కీలక వ్యాఖ్యలు చేసారు.ఉక్రెయిన్‌ ( Ukraine ) ఎలాంటి కుయుక్తులు పన్నినా రష్యా తప్పక విజయం సాధిస్తుందని, తమ భవిష్యత్తు అంతా సైనికుల భుజస్కందాలపైనే ఆధారపడి ఉందని ఈ సందర్భంగా పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేడు తమ మాతృభూమిపైనే యుద్ధం జరుతోందంటూ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Telugu Latest, Latest Nri, Russia, Russia Soldiers, Soviet, Telugu Nri, Ukraine,

ఈ సందర్భంగా.అనుభవజ్ఞులైన తన సాయుధ దళాలను ఉద్దేశించి రష్యా( Russia ) ఈ యుద్ధంలో తప్పక విజయం సాధించి తీరాలని, సాధించి తీరుతామని పిలుపు నిచ్చారు.‍ప్రస్తుతం సైనికులు పోరాట ప్రయత్నానికి మించినది ఏదీ లేదని, దేశం మొత్తం మీ వెంట ఉందని సైనికులకు ఆయన భరోసా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో పుతిన్‌ పాశ్చాత్య గ్లోబలిస్ట్ ఎలైట్స్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.వారంతా ప్రపంచ వ్యాప్తంగా విభేదాలు, తిరుగబాటులకు అంకురార్పణం చేస్తున్నారని దుయ్యబట్టారు.

Telugu Latest, Latest Nri, Russia, Russia Soldiers, Soviet, Telugu Nri, Ukraine,

అయితే, ఎటువంటి పరిస్థితినైనా రష్యా ఖచ్చితంగా అధిగమించగలదని, అందులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు.తాము అంతర్జాతీయ ఉగ్రవాదానికి ఎపుడూ వ్యతిరేకమని, ఉగ్రవాదాన్ని తిప్పికొట్టామని, తూర్పుఉక్రెయిన్‌ (డోన్బాస్‌) ప్రజలను రక్షించడమే గాక, వారి భద్రత కూడా కల్పిస్తామని ఈ సందర్భంగా హామీఇచ్చారు.ఇకపోతే, రష్యా ఉక్రెయిన్‌పై దాడికి దిగి 15 నెలలు పూర్తి కావస్తున్న తరుణంలో నాజీలపై మాస్కో సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే సాంప్రదాయ సోవియట్‌ శైలి కార్యక్రమం తొలిసారిగా భద్రతా భయాల నడుమ నిన్న అనగా మే 9న అంగరంగ వైభవంగా జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube