మన భారత దేశంలో అత్యంత ఆదరణీయమైన క్రీడ ఏదైనా ఉంది అంటే అది క్రికెట్ అని చెప్పక తప్పదు.ముఖ్యంగా మన దేశంలో క్రికెట్ అంటే అభిమానం దాటిపోయి క్రికెట్ అంటే ఒక మతంలా తయారయింది.
మన దేశంలో క్రికెట్ ఊహ తెలిసిన వయసు ఉన్న పిల్లాడి నుండి ఇంట్లో ఉండే అమ్మమ్మల వరకు అందరూ క్రికెట్ ను ఎంజాయ్ చేస్తారు.అది మన క్రికెట్ కు ఉన్న గొప్పతనం.
అయితే క్రికెటర్ లలో ఎవరి స్థాయిలో వారు గొప్పవారు.ఒక్కో వారు ఒక్కో దాంట్లో అద్భుతమైన స్కిల్ ను కలిగి ఉంటారు.
ఇక వారు అందులోనే వారి వంద శాతం చూపిస్తారు.
ఇక వేరే ఫార్మాట్ లో ఆడలేరు అని ఒక బలమైన ముద్ర వేస్తారు.
కాని అది ఆ క్రికెటర్ ను ఎంతలా బాధిస్తుందో మనకేం తెలుసు.అచ్చం ఇలాగే ది నయా వాల్ పుజారా విషయంలో జరిగింది.పుజారా టెస్ట్ ఫార్మాట్ కు మాత్రమే పనికోస్తాడని, టీ ట్వంటీ, వన్డేలకు పనికి రాడని, భారీ సిక్సర్లతో చెలరేగడని ఒక బలమైన అభిప్రాయాన్ని ఏర్పరిచారు.తాజాగా ఐపీఎల్ ప్రాక్టీస్ సందర్భంగా నెట్ లో సిక్సర్లతో పుజారా చెలరేగాడు.
తన విశ్వ రూపాన్ని చూపించాడని చెప్పవచ్చు.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మీకూ ఈ వీడియో చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.