వైరల్: తండ్రికి గిఫ్ట్ ఇచ్చిన కొడుకు... తండ్రి ఆనందం చూడండి!

సోషల్ మీడియాలో ఒక్కోసారి వైరల్ అయిన వీడియోలను చూస్తే మనసుకి హత్తుకునేవిగా కనబడతాయి.అటువంటి వీడియోలు నెటిజన్ల మనసులను దోచుకుంటాయి.

 Viral The Son Who Gave His Father A Gift See The Joy Of The Father ,son , Fathe-TeluguStop.com

ఇకపోతే బిడ్డల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారు.ఈ క్రమంలో తమ సుఖాలను పక్కనబెట్టి మరీ పిల్లల ఆనందానికి పాటుపడతారు.

ఇక వృద్ధిలోకి వచ్చిన బిడ్డలు తమ ఇష్టాల్ని నెరవేరిస్తే.ఇక ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులే వుండవు.

అవును, ఈ కోవకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొడుకు తన తండ్రికి ( son , father )ఊహించని బహుమతి ఇచ్చాడు.అది చూసిన తరువాత తండ్రి ఎంత ఎమోషనల్ అయ్యాడో ఇక్కడ వీడియో చూడండి.ఫెర్నాండెజ్ ( Fernandez )అనే కుర్రాడు తన తండ్రికి అరుదైన బహుమతి ఇచ్చాడు.

అతని తండ్రి 40 సంవత్సరాల క్రితం యుద్ధం జరుగుతున్న సమయంలో ఎల్ సాల్వడార్‌ నుంచి ఆస్ట్రేలియాకు తన కుటుంబాన్ని తీసుకు వచ్చేసాడు.అతని తండ్రికి అప్పుడు 25 సంవత్సరాలు కాగా ఆస్ట్రేలియాలో( Australia ) స్థిరపడటానికి వారు ఎంతో కష్టపడ్డారు.

అతని తండ్రి ఎంతో ఇష్టమైన తన దేశాన్ని మర్చిపోవాల్సి వచ్చింది.తిరిగి వెళ్లడానికి కూడా స్థోమత లేని పరిస్థితుల్లో ఇంచుమించుగా తన దేశాన్ని మర్చిపోయాడతను.

కాగా, ఇప్పుడు ఫెర్నాండెజ్ కు 27 సంవత్సరాలు.కొన్నేళ్లుగా తమ కుటుంబాన్ని పోషించడానికి తండ్రి పడ్డ కష్టాన్ని గుర్తించిన ఫెర్నాండెజ్.తన దేశమంటే తండ్రికి ఎంత ఇష్టమో తెలుసుకున్నాడు.అందుకే తండ్రి తన స్వదేశానికి వెళ్లేందుకు విమాన టిక్కెట్లు కొని ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు.3 దశాబ్దాలుగా తన స్వదేశాన్ని చూడలేకపోయిన ఆ తండ్రి ఆనందం ఒక్కమాటలో చెప్పడం కష్టం.తన బిడ్డ ఇచ్చిన బహుమతికి కళ్లు చమ్మగిల్లి కొడుకును దగ్గరగా హత్తుకున్నాడు.

ఈ సందర్భంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసినవారంతా ఎమోషనల్ గా స్పందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube