పక్షులు సాధారణంగా మనిషి కంటే బలహీనంగా ఉంటాయి.అయితే ఎలాంటి పక్షికైనా ఒక్కసారి తిక్కరేగిందంటే ఎంతటి బలవంతుడికైనా చుక్కలు చూపిస్తాయి.
అలాంటిది మన జాతీయ పక్షి నెమలి చూస్తూ ఊరుకుంటుందా? తేడా వస్తే తాట తీస్తాయి.అవును, ఓ నెమలి ( peacock )తన గూడు నుంచి గుడ్లు దొంగిలించబోయిన మహిళలకి ఎలా బుద్ధి చెప్పిందో ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని చూస్తే మీకే తెలుస్తుంది.
వైరల్ అవుతున్న వీడియోని ఒక్కసారి పరిశీలిస్తే ఓ నెమలి చెట్టుపై ఉన్న తన గూడులో గుడ్లు పెట్టింది.ఆ గుడ్లపై కన్నేసిన ఇద్దరు మహిళలు వాటిని ఎలాగైనా దొంగిలించాలని ప్లాన్ చేసారు.
దాంతో ఒకరోజు వాళ్ళు నెమలి లేని సమయంలో ఆ చెట్టు దగ్గరకు వెళ్లి, ఆ గుడ్లను దొంగిలించే ప్రయత్నం చేసారు.ఈ క్రమంలో ఓ మహిళ చెట్టెక్కి కింద నిలబడి ఉన్న మహిళకు గుడ్లు అందించడం మొదలుపెట్టింది.
అయితే ఆ విషయం ఎలా పసిగట్టిందో… ఎగురుకుంటూ వచ్చిన నెమలి ఒక్కసారిగా చెట్టుపై ఉన్న మహిళపై దాడి చేసింది.

ఆ కిందనే ఉండి ఇదంతా చూస్తున్న మహిళను కూడా నెమలి విడిచి పెట్టలేదు.ఒక్క ఉదుటన ఆమెపైకి కూడా దూకి ఒక్కటిచ్చింది.దాంతో ఆమె కింద పడిపోయింది.
ఇంకేముంది కట్ చేస్తే ఎక్కడి గుడ్లను అక్కడే వదిలి భయంతో అక్కడి నుంచి వారు పరుగులెత్తారు.ది ఫిగెన్( The Figen ) అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ అయిన ఈ వీడియోకి లక్షల సంఖ్యలో వ్యూస్ రావడం కొసమెరుపు.
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు నెమలి తన గుడ్లను కాపాడుకున్న తీరుని చూసి అభినందిస్తున్నారు.ఇలాంటి సంఘటనలు చూసైనా పక్షులు, జంతువుల జోలికి పోవద్దని సలహా ఇస్తున్నారు.







