తెలంగాణ బీజేపీలో( Telangana BJP ) గత కొన్నాళ్లుగా ముసలం నడుస్తున్న సంగతి తెలిసిందే.సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీ విడుతున్నారు.
ఈసారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారని నమ్మిన నేతలే పార్టీ నుంచి మెల్లగా జరుకుంటుండడంతో ఎవరిని నమ్మలో ఎవరిని నమ్మకూడదో అర్థం కానీ అయోమయంలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.స్క్రినింగ్ కమిటీ చైర్మెన్ గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( Komatireddy Rajagopal Reddy ) పార్టీ వీడి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే.
అలాగే మేనిఫెస్టో రూపకల్పన చైర్మెన్ గా ఉన్న వివేక్( Vivek ) సైతం కమలం పార్టీకి గుడ్ పై చెప్పారు.దీంతో ఎలక్షన్ వార్ లో ఇతర పార్టీలతో పోల్చితే బీజేపీ వ్యవహారం నత్తనడకన సాగుతోంది.
ఇప్పటివరకు అరకొరగా 88 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మిగిలిన స్థానాలను ప్రకటించాల్సివుంది.అలాగే మేనిఫెస్టో( BJP Manifesto ) కూడా ప్రకటించి ప్రచారంలో దూకుడుగా వ్యవహరించాలి.కానీ అలా జరగడం లేదు.ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేతలను పార్టీ మారకుండా కాపాడుకోవడమే పెద్ద టాస్క్ లా మారింది.ఇప్పటికే సీనియర్ నేతలు ప్యాకప్ చెప్పడంతో పార్టీలో ఉన్న మరికొంతమంది అసంతృప్త నేతలపై అధిష్టానానికి అనుమానాలు మొదలయ్యాయి.ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ విజయశాంతిని( Vijayashanti ) పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
తాజాగా ప్రకటించిన స్టార్ క్యాంపైనర్ల జాబితాలో( BJP Star Campaigners ) ఆమెకు చోటు దక్కకపోవడమే ఇందుకు కారణం.40 మంది స్టార్ క్యాంపైనర్లను ప్రకటించిన కమలం పార్టీ అందులో రాములమ్మ పేరును ప్రస్తావించలేదు.దీంతో పార్టీ అధిష్టానం ఆమెను కావాలనే పక్కన పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆమె గత కొన్నాళ్లుగా పార్టీపై అసంతృప్తిగా ఉంటూ వస్తున్నారు.ఆ మద్య ఆమెతో చర్చలు జరిపిన వివేక్, రాజగోపాల్ రెడ్డి వంటి వారు సైతం పార్టీ వీడారు.దాంతో విజయశాంతి కూడా పార్టీ విడతరేమో అని భావించి ఆమెకు చోటు కల్పించలేదనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.మరి ఆల్రెడీ ప్రదాన్యత దక్కలేదని అసంతృప్తిగా ఉన్న రాములమ్మ.తాజా పరిణామాలతో బీజేపీకి గుడ్ బై చెబుతారా ? లేదా అలాగే కొనసాగుతారా ? అనేది చూడాలి.