టాలీవుడ్ మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్ ( Varun tej )ఇటీవలే గాండీవదారి అర్జున సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.
ఇకపోతే ప్రస్తుతం వరుణ్ తేజ్ మట్కా, ఆపరేషన్ వాలంటైన్ అనే రెండు సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.గాండీవధారి అర్జున సినిమా ఘోరమైన డిజాస్టర్ ను చవి చూడడంతో ఈ రెండు సినిమాలతో ఎలా అయినా హిట్ కొట్టాలని చూస్తున్నారు వరుణ్ తేజ్.
సంగతి అటు ఉంచితే ఇటీవలే వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya tripathi ) ల ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.
త్వరలోనే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు.కాగా ప్రస్తుతం షూటింగులకు కాస్త గ్యాప్ ఇచ్చిన వరుణ్ తేజ్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లారు.ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి కెన్యాలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు వరుణ్ తేజ్.
తండ్రి నాగబాబు( Naga Babu ) తల్లి చెల్లెలు నిహారికతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.కెన్యాలోని లేక్ నకురు నేషనల్ పార్క్‌లో ఎంజాయ్ చేయడానికి వెళ్లారు.లేక్ నకురు నేషనల్ పార్క్‌లో తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో వరుణ్ తేజ్, నిహారిక అభిమానులతో పంచుకున్నారు.
సాంయకాలం సమయంలో లేక్ వ్యూ రెస్టారెంట్ వద్ద టేబుల్ ముందు కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాధిస్తున్నారు వరుణ్ తేజ్ ఫ్యామిలీ.
కాగా ఆ ఫొటోలు చూసిన అభిమానులు చాలా బాగున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు.ఆ ఫోటోలు పై లావణ్య త్రిపాఠి కూడా స్పందించారు.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు నెటిజన్స్ వరుణ్ కి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు.
ఫస్ట్ పిక్‌లో లేని గ్లాసు సెకండ్ పిక్‌లో ఎలా వచ్చింది అన్న? అని ప్రశ్నించాడు.అంటే, లేక్ కనిపిస్తూ వెనుక నుంచి తీసిన ఫొటోలో డైనింగ్ టేబుల్‌పై జ్యూస్ గ్లాస్ ఉంది.
ఆ గ్లాస్ ఎలా వచ్చిందనేది ఇతగాడి ప్రశ్న.ఈ ప్రశ్నకు సరదా రిప్లైలు కూడా వచ్చాయి.
ఎంత బాగా కనిపెట్టావో అంటూ రిప్లై ఇచ్చారు వరుణ్ తేజ్.