రక్షణ, అంతరిక్ష సమాచారాన్ని రహస్యంగా మాతృదేశానికి పంపిన చైనా జాతీయుడు

రక్షణ, అంతరిక్ష సమాచారాన్ని రహస్యంగా మాతృదేశానికి పంపినందుకు గాను చైనా జాతీయుడికి అమెరికా ప్రభుత్వం 40 నెలల జైలు శిక్షను విధించింది.39 ఏళ్ల టావో లీ అండర్‌కవర్ ఏజెంట్‌‌ను కలిసేందుకు గాను చైనా నుంచి ఆరిజోనా వచ్చాడు.ఈ క్రమంలో 2018 సెప్టెంబర్‌లో లాస్ ఏంజెల్స్‌ ఎయిర్‌పోర్ట్‌లో లీని అరెస్ట్ చేశారు.

 Valuabledata Wastheftbychina Men-TeluguStop.com

2016 డిసెంబర్- 2018 జనవరి మధ్యకాలంలో ఇతను చైనాకు చెందిన కొందరితో కలిసి రేడియేషన్ సంబంధిత పవర్ ఎంప్లిఫయర్లు, సూపర్‌వైజరీ సర్క్యూట్స్‌లను కొనుగోలు చేయడంతో పాటు వాటిని అక్రమంగా అమెరికా నుంచి చైనాకు ఎగుమతి చేసినట్లు న్యాయశాఖ తెలిపింది.

లీ కొనుగోలు చేయాలని భావించిన ఎలక్ట్రానిక్ విభాగాలు అధికస్థాయి రేడియేషన్ మరియు విపరీతమైన వేడిని తట్టుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.వీటిని ప్రధానంగా మిలటరీ మరియు అంతరిక్ష పరికరాల్లో ముఖ్యంగా ఉపయోగపడతాయని న్యాయ విభాగం పేర్కొంది.

Telugu China, Telugu Nri Ups, Telugu Ups-

  ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు చేసేందుకు గాను లీ నకిలీ పేర్లతో ఆర్డర్లు ఇచ్చేవాడు.ఇతనితో పాటు ఇతనికి సహకరించిన మిగిలిన చైనా జాతీయులు అక్రమంగా పరికరాలు కొనుగోలు చేసేందుకు గాను ఎంతైనా చెల్లించేందుకు సిద్ధపడ్డారని.నగదు లావాదేవీల కోసం ఆరిజోనాలోని ఓ బ్యాంక్‌ను ఆశ్రయించినట్లుగా దర్యాప్తులో తేలింది.సుధీర్ఘ దర్యాప్తు అనంతరం టావో లీకి ఫెడరల్ న్యాయస్ధానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

ఈ సంఘటనతో చైనా జాతీయులు, చైనా సంస్థల పట్ల అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube