ఉత్తమ్ కి సిఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి:కోమటిరెడ్డి రాజపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా( Nalgonda District ):మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy) మీద మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉత్తమ్ కు ఉన్నాయని,భవిష్యత్తులో ఎప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.

అసలు ఇప్పటికే ఉత్తమ్ సీఎం అవ్వాల్సిందని,కొద్దిలో మిస్ అయిందన్నారు.తన నాలిక మీద మచ్చలు ఉన్నాయని,తను ఏదైనా అంటే అది ఖచ్చితంగా జరుగుతుందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Uttam Has All The Qualifications To Become CM: Komati Reddy Rajapal Reddy , Na

అందుకే తాను ఊరికే అనడం లేదని,నిజంగా జరిగేదె చెప్తున్నానని,అతి త్వరలో ఉత్తమ్ కుమార్ ను మనం ముఖ్యమంత్రి గారూ అని పిలుస్తామని అన్నారు.కాగా ఈ వ్యాఖ్యలతో ఇటు ఉత్తమ్ వర్గం,అటు రాజగోపాల్ రెడ్డి వర్గం సంతోషంగా ఉన్నా,రేవంత్ వర్గం మాత్రం గుర్రుగా ఉన్నారు.

రేవంత్ సీఎం అవడం కాంగ్రెస్ పార్టీ( Congress party )లోని సీనియర్లకు ఇష్టం లేకనే రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Advertisement
ప్రతీ ఒక్కరికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం : సీఐ శ్రీను నాయక్

Latest Nalgonda News