సూర్యాపేట జిల్లా( Suryapet District ):కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం ఏర్పడిన టాడి కార్పొరేషన్ కు తగిన నిధులు కేటాయించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ అన్నారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్గూరి గోవిందు అధ్యక్షతన జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ కల్లు గీత వృత్తిలో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
టాడి కార్పొరేషన్ ఉద్దేశ్యం వృత్తిలో ఆధునీకరణ పద్ధతులు తీసుకురావడం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమని,కానీ, నిధుల కేటాయింపు సరిగా లేకపోవడంతో ఆ పని చేయడం లేదన్నారు.రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమం కోసం కేటాయించిన డబ్బులతో హైదరాబాదులోని నెక్లెస్ రోడ్ లో నీరా కేఫ్ నిర్మించారన్నారు.
ఇది రాష్ట్ర గీత కార్మికులందరి ఆస్తి అని, ఇది టూరిజం శాఖ ఆధీనంలో ఉండడం ఏంటని ప్రశ్నించారు.వెంటనే టాడీ కార్పొరేషన్ కు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని నందనంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చిన యంత్రాలు,కట్టిన భవనం నిరుపయోగంగా ఉంటుందన్నారు.దీనిని వెంటనే పునరుద్ధరించాలని, ప్రతి జిల్లాలో నీరా,తాటి,ఈత ఉత్పత్తుల పరిశ్రమలు పెట్టి యువతీ,యువకులకు ఉపాధి కల్పించాలన్నారు.
అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు( Bellamkonda.venkateswarlu ) మాట్లాడుతూ రాష్ట్రంలోని వృత్తి చేసే వారందరికీ ప్రమాద నివారణకు సేఫ్టీ కిట్టులు త్వరగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
దీనిపై అవగాహన కల్పించేందుకు కల్లుగీత కార్మిక సంఘం కృషి చేస్తుందన్నారు.అక్టోబర్ లో గీత కార్మికులతో రాష్ట్ర సదస్సు హైదరాబాదులో నిర్వహిస్తామన్నారు.
ఈ తొమ్మిది నెలల కాలంలో వృత్తిలో ప్రమాదం జరిగిన వారికి ఇవ్వాల్సిన ఎక్సిగ్రేషియా డబ్బులు 8 కోట్లు వెంటనే ఇవ్వాలని,560 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని,కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని తీర్మానించడం జరిగిందన్నారు.అనంతరం కల్లుగీత కార్మిక సంఘం కండువాలు,జెండాలు సీనియర్ నాయకులు చింతల మల్లేశం గౌడ్ అన్ని జిల్లాల వారికి ఉచితంగా పంపిణీ చేశారు.
ఇంకా ఈ సమావేశంలో సూర్యాపేట జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు,రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.వెంకట నరసయ్య,గౌని వెంకన్న,గాలి అంజయ్య,రాష్ట్ర కార్యదర్శులు ఎస్.రమేష్ గౌడ్,బూడిద గోపి, బండకింది అరుణ్,గాలి అంజయ్య,బోడపట్ల సుదర్శన్, కొండ వెంకన్న,రాగి కృష్ణయ్య, యమగాని వెంకన్న,గౌని వెంకన్న,గుణగంటి మోహన్, వీరస్వామి,లచ్చన్న,అబ్బగాని భిక్షం,తుమ్మల సైదయ్య, గుణగంటి కృష్ణ,ఉయ్యాల నగేష్,బత్తుల జనార్ధన్, బాలగాని రేణుక, కొండ కర్ణాకర్,అంబాల శ్రీనివాస్, బట్టిపల్లి నాగమల్లయ్య, కారింగుల సైదమ్మ,బోడ సైదులు,గుండగాని శ్రీనివాస్, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.