కింగ్ చార్లెస్ III పట్టాభిషేక మహోత్సవం .. ఆహ్వానం అందుకున్న భారతీయులు వీరే

బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ III( King Charles III ) పట్టాభిషేకం మే 6న జరగనున్న సంగతి తెలిసిందే.దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.

 Uk These Indian Origin Charity Champions Will Attend King Charles Coronat-TeluguStop.com

లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో జరిగే ఈ కార్మక్రమానికి ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లిపోయాయి.అతిరథ మహారథులు కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి హాజరుకానున్నారు.

మొత్తం 2,200 మంది అతిథులు ఈ కార్యక్రమానికి వస్తారని అంచనా.ఇంతటి చారిత్రక ఘట్టానికి పలువురు భారతీయులకు కూడా ఆహ్వానం అందింది.

సోమవారం సాయంత్రం ఆవిష్కరించిన అతిథుల జాబితాలో ఈ మేరకు భారతీయ ప్రముఖులకు ఆహ్వానాలు అందించినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది.రాజకుటుంబ సభ్యులు, కమ్యూనిటీ, ఛారిటీ ఛాంపియన్‌లతో పాటు 100 మంది దేశాధినేతలు సహా 203 దేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు రానున్నారని వెల్లడించింది.

Telugu Gulfsha, Indianorigin, Jay Patel, Queen Camilla, Charles Coronat, Charles

ఇక భారతీయుల విషయానికి వస్తే.ప్రిన్స్ ఫౌండేషన్ బిల్డింగ్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్, ప్రిన్స్ ఫౌండేషనల్ స్కూల్ ఆఫ్ ట్రెడిషనల్ ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ సౌరభ్ ఫడ్కే( Sourabh Phadke ) ఆహ్వానితుల్లో వున్నారు.ఈయన 2018-19లో హిల్స్‌బరో కాజిల్ వాల్ గార్డెన్‌లో సమ్మర్ హౌస్ లైవ్ బిల్డ్ పూర్తి చేసిన విద్యార్ధుల బృందంలో ఒకరు.స్కాట్లాండ్‌లోని డంఫ్రైస్ హౌస్‌లో చదువుకోవడానికి ముందే.

సౌరభ్ (37) సంచార జీవనం చేశారు.కమ్యూనిటీల గృహ నిర్మాణం, పాఠశాలలను నిర్మించేందుకు గాను తన ఆర్కిటెక్టింగ్ ప్రతిభను ఉపయోగించాడు.

Telugu Gulfsha, Indianorigin, Jay Patel, Queen Camilla, Charles Coronat, Charles

ఆయనతో పాటు 2022లో ప్రిన్స్ ట్రస్ట్ గ్లోబల్ అవార్డును అందుకున్న గల్షా.( Gulfsha ) 2022లో ప్రిన్స్ ట్రస్ట్ కెనడా యూత్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన కెనడాకు చెందిన జే పటేల్‌ను( Jay Patel ) కూడా ఆహ్వానించారు.అలాగే కింగ్, క్వీన్ కెమిల్లా, యూకే ప్రభుత్వంచే నామినేట్ చేయబడిన 400 మంది స్వచ్ఛంద సంస్థల యువత కూడా కార్యక్రమంలో పాల్గొంటారు.మొత్తం అతిథుల జాబితాలో పార్లమెంట్ సభ్యులు, మాజీ బ్రిటీష్ ప్రధాన మంత్రులు, మతపెద్దలు, నోబెల్ బహుమతి విజేతలు, బ్రిటీష్ ఎంపైర్ మెడల్ గ్రహీతలు, తదితరులు వున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube