టక్ జగదీష్ రివ్యూ అండ్ రేటింగ్

న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’ గతకొద్ది రోజులుగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడంతో ఈ సినిమాను బ్యాన్ చేస్తామంటూ పలువురు ఎగ్జిబిటర్లు వ్యాఖ్యాలు చేశారు.

 Tuck Jagadish Review And Rating, Nani, Tuck Jagadish, Tuck Jagadish Review, Tuck-TeluguStop.com

దీంతో ఈ సినిమా ఉలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.అయితే ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

కానీ అంతకుముందే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో పెట్టారు చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.

జగదీష్ నాయుడు(నాని) తన కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తాడు.తన తండ్రి(నాజర్) హఠాత్తుగా చనిపోవడంతో తన అన్నయ్య బోస్ బాబు(జగపతి బాబు)కు ఇంటి బాధ్యతలు అప్పగించి పట్నం వెళ్తాడు.

అయితే తాను తిరిగి వచ్చే సరికి అతడి మేనకోడలు చంద్రమ్మ(ఐశ్వర్యా రాజేష్) పెళ్లి వేరే వ్యక్తితో జరిగిపోతుంది.దీంతో జగదీష్ చాలా అప్‌సెట్ అవుతాడు.

అయితే ఈలోగా కుటుంబంలో తలెత్తిన సమస్యలు, ఊరి జనం తమ కుటుంబంపై తీవ్ర ఆగ్రహంగా ఉండటం చూసి జగదీష్ చాలా బాధపడతాడు.తన కుటుంబంలో ఇలాంటి పరిణామాలు జరగడానికి ఎవరు కారణం.? చంద్ర పెళ్లి ఎవరితో చేశారు.? ఇంతకీ జగదీష్ కుటుంబంలో ఎవరు మారిపోయారు.? అనేది సినిమా కథ.

నాని ఎంచుకునే కథలు ఎందుకు ప్రేక్షకులకు బాగా నచ్చుతాయో ఈ సినిమా చూస్తే మరోసారి అందరికీ అర్థం అవుతుంది.ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది.ఎలాంటి కమర్షియల్ అంశాలకు తావివ్వకుండా, ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ఆయన తీర్చిదిద్దడం ప్రేక్షకులను మెప్పించిందని చెప్పాలి.

ఈ సినిమాలో ఎలాంటి మాస్ అంశాలు లేకుండా ఒక కుటుంబం కోసం హీరో చేసే పోరాటం గురించే మనకు చూపించారు.అయితే ఈ సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించకపోవచ్చని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో నాని యాక్టింగ్ ప్రేక్షకులను మెప్పించినా, సినిమాలోని మిగతా నటీనటులు కాస్త ఓవర్ యాక్టింగ్ చేసినట్లు కనిపిస్తుంది.సినిమా కథలో పస లేకపోవడంతో వారి నటన మనకు అలా కనిపిస్తుంది.

ఇక హీరోయిన్‌గా రీతూ వర్మ ఎలాంటి ప్రాముఖ్యత లేని పాత్రలో నటించడం ఆమె కెరీర్‌కు బాగా మైనస్ అని చెప్పాలి.సినిమాలోని పాటలు, సంగీతం అంతంత మాత్రంగా ఉండటం, ఎడిటింగ్ వర్క్ ఇంకా ఉండాల్సిన అవసరం, నిర్మాణ విలువలు కాస్త ఓవర్ అయ్యాయని అనిపించడంతో ఈ సినిమా సాధారణ ప్రేక్షకుడికి నచ్చలేదని చెప్పొచ్చు.

చివరగా:

టక్ జగదీష్: నాని తప్ప ఏమీ లేని సినిమా!

రేటింగ్:

2.5/5.0

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube