అభిశంసనకు సాక్ష్యం: విదేశాంగ ఉద్యోగిపై ట్రంప్ మండిపాటు

ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా డొనాల్డ్ ట్రంప్ అభిశంసన తీర్మానం గురించి పెద్ద చర్చ నడుస్తోంది.ట్రంప్‌ను గద్దెదించేందుకు గాను సాక్ష్యాధారాలు సేకరించేందుకు డెమొక్రాట్లు పావులు కదుపుతున్నారు.

 Trump Lashes Out At State Department Employee Ahead Testimony-TeluguStop.com

ఈ క్రమంలో బహిరంగ విచారణలో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తున్న వారిపై ట్రంప్ విరుచుకుపడుతున్నారు.తాజాగా చట్టసభ సభ్యుల ముందు ఈ వారం సాక్ష్యమిచ్చేందుకు సిద్ధమైన ఒక విదేశాంగశాఖ ఉద్యోగిపై ఆదివారం ట్రంప్ మండిపడ్డారు.

ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సహాయకుడు మరియు కెరీర్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ జెన్నిఫర్ విలియమ్స్ మంగళవారం హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ ముందు విచారణకు హాజరుకానున్నారు.

ఈ క్రమంలో ట్వీట్టర్ ద్వారా స్పందించిన ట్రంప్ దర్యాప్తులో సాక్ష్యమిచ్చిన ఇతర అధికారులపై తాను లేవనెత్తిన నిరాధారమైన ఆరోపణను పునరుద్ఘాటించారు.

విలియమ్సన్‌ను నెవర్ ట్రంపర్‌గా అభివర్ణించారు.కాగా.

ఈ నెల ప్రారంభంలో క్లోజ్డ్ డోర్ సమయంలో తాను వైట్ హౌస్ సిట్యువేషన్ రూమ్‌లో ఉన్నానని విలియమ్సన్ చట్టసభ సభ్యులకు తెలిపారు.డొనాల్డ్ ట్రంప్ జూలై 25న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్‌డైమిర్ జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడిన సమయంలో తాను విన్నట్లు పేర్కొన్నారు.

Telugu Employee, Telugu Nri Ups, Trump-

ట్రంప్ జూలై 25న ఉక్రెయిన్ అధ్యక్షునితో జరిపిన సంభాషణే ప్రస్తుత అభిశంసనకు కారణం.మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ కుమారుడు ఉక్రెయిన్‌లోని ఒక చమురు కంపెనీలో ఉద్యోగం పొందాడు.దీనిపై నిర్ధిష్ట దర్యాప్తు దర్యాప్తు చేయాల్సందిగా ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ఒత్తిడి తెస్తున్నారు.లేని పక్షంలో ఆ దేశానికి భద్రతాపరమైన సాయాన్ని స్తంభింపజేస్తామని ట్రంప్ బెదిరించారన్నది విపక్షాల ఆరోపణ.

కాగా విలియమ్సన్‌పై ట్రంప్ మండిపడిన తర్వాత దీనిపై పెన్స్ కార్యాలయం నిరాకరించింది.

అభిశంసనకు సాక్ష్యం చెప్పడానికి నిర్ణయించుకున్న తర్వాత ఉపాధ్యక్షుడి కార్యాలయంలోని సిబ్బంది పెన్స్ నుంచి విలియమ్సన్‌‌ను దూరం చేయడానికి గట్టి ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది.

జెన్నిఫర్ విలియమ్సన్‌ ప్రస్తుతం ఉపాధ్యక్షుడికి యూరప్ మరియు రష్యాలకు సంబంధించిన విషయాలపై సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.వైస్ ప్రెసిడెంట్ కార్యాలయంలోని ప్రస్తుత మరియు మాజీ ఉద్యోగులు ఆమె సమర్థతను కొనియాడుతున్నారు.

కాగా ఇప్పటికే ఉక్రెయిన్‌లో అమెరికా అత్యున్నత దౌత్యవేత్త బిల్ టేలర్‌ మరియు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ అలెగ్జాండర్ విండ్‌మన్‌లపై ట్రంప్ మండిపడిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube