ఆ భయం టీఆర్ఎస్ కు 'గుర్తు'కు వస్తూనే ఉందా ?

తెలంగాణలోని హుజూర్ నగర్ ఉప ఎన్నిక సందడిలో అన్ని పార్టీలు ఉన్నాయి.ఎప్పటికప్పుడు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఒక పార్టీ మీద మరో పార్టీ పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

 Trs Suffer From Huzurnagar Assembly Elections-TeluguStop.com

అసలు ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయిపోయింది.అక్టోబర్ 21 వ తేదీన ఎన్నికలు జరగడం, ఆ తరువాత 24 వ తేదీనే ఫలితాల ప్రకటన ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు అలెర్ట్ గా ముందుకు వెళ్లిపోతున్నాయి.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కూడా ఇప్పటికే అన్ని పార్టీలు ప్రకటించేయడంతో ఇప్పుడు ప్రచారం మీదే దృష్టిపెట్టాయి.ఇక టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన పోటీ దారుగా ఉన్నకాంగ్రెస్ పార్టీకి ఇది సిట్టింగ్ స్థానం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

అందుకే ఇక్కడ జనసేన పార్టీ మద్దతు తీసుకుని పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించాలనే ఆలోచనలో ఉంది.టీఆర్ఎస్ పార్టీ సీపీఎం మద్దతు కూడగట్టుకుని కాస్త ముందంజలో ఉన్నట్టు కనిపిస్తున్న ఆ పార్టీకి గుర్తుల భయం వెంటాడుతోందట.

Telugu Congress, Chandra Shekar, Mp Kavitha, Trssuffer-Telugu Political News

  గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటింగ్ శాతం తగ్గడానికి, టీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి చెందడానికి ప్రధాన కారణం గుర్తులే అని టీఆర్ఎస్ భావిస్తోంది.ముఖ్యంగా రోడ్ రోలర్, ట్రాక్టర్, ఆటో గుర్తులు తమ పార్టీని వెంటాడుతున్నాయని అంటున్నారు.అచ్చం కారు గుర్తులా ఉండి తమ ఓట్లకు గండికొట్టాయని వారు వాపోతున్నారు.ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందేమో అన్న భయం టీఆర్ఎస్ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో 24 మంది స్వతంత్ర్య అభ్యర్థులు ఉన్నారు.మిగతా నలుగురు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు చెందిన వారు.

ఆ తరువాత ఐదవ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి మహేష్ కు ట్రాక్టర్ గుర్తు ఉంది.దీంతో టీఆర్ఎస్‌లో భయం పెరిగిపోయింది.

Telugu Congress, Chandra Shekar, Mp Kavitha, Trssuffer-Telugu Political News

  ప్రజలు ఏమాత్రం కన్‌ఫ్యూజ్ అయినా తమ ఓట్లు అటు వేల్లోపోయే అవకాశం ఉంటుందని అధికార టీఆర్ఎస్ పార్టీ భయపడుతోంది.అందుకే ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేశారట.అలా కుదరకపోతే తమ పార్టీ గుర్తైన కారు గుర్తును మరింత ముదురు రంగులో ఉంచాలని విజ్ఞప్తి చేశారట.అయితే అలా చేయడం కుదరదని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో టీఆర్ఎస్ లో మరింత కంగారు మొదలయ్యిందట.

ఏదో ఒక రకంగా గుర్తు విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఎవరూ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేలా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచనలు చేసినట్టు సమాచారం.మొత్తానికి టీఆర్ఎస్ పార్టీకి గుర్తుల భయం బాగా ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube