స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా, నేటికీ చాలా చోట్ల మన దేశంలో సరైన సదుపాయాలు లేవు.ఎంతంటే కనీసం రోడ్లు, విద్య, వైద్యం కోసం ఎన్నో సమస్యలు ఉన్నాయి.
ఇప్పటికీ చాలా మంది పేదలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.వారి కష్టాలు వర్ణనాతీతం.
అలాంటి ఓ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో ఓ గర్భిణీని ఆమె భర్త అంబులెన్స్ కోసం తోపుడు బండిపై ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
తీరా ఆసుపత్రికి వెళ్లిన తర్వాత అక్కడ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఎవరూ లేరు.ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు విచారణ ప్రారంభించారు.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కైలాష్ అహిర్వాల్ అనే వ్యక్తి భార్య నిండు గర్భిణీ.
ఆమెకు నొప్పులు రావడంతో అతడు అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు.వారు అంబులెన్స్ లేదని సమాచారం ఇవ్వడంతో అతడు చాలా నిరాశ చెందాడు.
ఓ వైపు అతడి భార్య పురిటి నొప్పులు వేదన పడుతోంది.దీంతో విధి లేని పరిస్థితుల్లో ఓ తోపుడు బండి మీద ఆమెను తీసుకుని, ఆసుపత్రికి వెళ్లాడు.
ఒక కిలోమీటరు ప్రయాణం తర్వాత స్థానిక ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నప్పుడు, అక్కడ డాక్టర్ లేదా నర్సు లేరు.ఈ సంఘటన మంగళవారం దామోహ్ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలోని రానేహ్ గ్రామంలో జరిగింది.
కైలాష్ అహిర్వాల్ తన భార్యను తోపుడు బండిపై తీసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీనిపై హట్టా బ్లాక్ మెడికల్ ఆఫీసర్ ఆర్పీ కోరి స్పందించారు.
ఈ ఘటనపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు.గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ ఎందుకు ఇవ్వలేదో సంబంధిత ఉద్యోగులకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.
మంగళవారం తన భార్యకు ప్రసవ నొప్పులు రావడంతో 108 ప్రభుత్వ అంబులెన్స్‌కు ఫోన్ చేసి రెండు గంటలైనా అంబులెన్స్ రాలేదని అహిర్వాల్ ఆరోపించాడు.ప్రస్తుతం బాధితురాలిని ప్రభుత్వ అంబులెన్స్ ద్వారా హట్టాకు తరలించారు.
అయితే అక్కడ సరైన చికిత్స లభించకపోవడంతో, ఆమె ఇప్పుడు వైద్య పర్యవేక్షణలో ఉన్న దామోహ్ జిల్లా ఆసుపత్రికి తరలించబడింది.