గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష అధికారులకు శిక్షణా కార్యక్రమం

నల్లగొండ జిల్లా:ఈ నెల 9 న ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహించనున్న గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు జిల్లాలో మొత్తం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని,జిల్లా నుండి 16,899 మంది అభ్యర్థులు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలను రాయనున్నట్లు నోడల్ ఆఫీసర్,అడిషనల్ ఎస్పి రాములు నాయక్ తెలిపారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పి చందనా దీప్తి ఆదేశాల మేరకు నోడల్ ఆఫీసర్, అడిషనల్ ఎస్పి రాములు నాయక్ అధ్వర్యంలో చీఫ్ సూపర్డెంట్లకు మరియు బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు నల్గొండ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ తో పాటు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులు ఎలాంటి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, క్యాలిక్యులేటర్లు,టాబ్లెట్స్, పెన్ డ్రైవ్లు,బ్లూటూత్ డివైస్లు,ఎలక్ట్రానిక్ వాచ్ లు,మ్యాథమెటికల్ టేబుల్స్,లాక్ బుక్కులు, లాగ్ టేబుల్స్,వాలెట్లు, హ్యాండ్ బ్యాగ్ లు,రైటింగ్ ప్యాడ్,అలాగే బంగారు ఆభరణాలు,ఇతర గాడ్జట్లు,ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు,రికార్డింగ్ వస్తువులు అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Training Program For Group-1 Preliminary Examination Officers , Group-1 Prelimi

పరీక్ష పూర్తయ్యేంతవరకు అభ్యర్థులు పరీక్ష కేంద్రం వదిలి వెళ్ళకూడదని, పరీక్ష కేంద్రం వదిలి వెళ్ళే ముందు తప్పనిసరిగా ఓఎంఆర్ ఆన్సర్ సీట్లను అప్పగించి వెళ్ళాలని సూచించారు.పరీక్షలు రాసే అభ్యర్థులు పరీక్ష కేంద్రంలో ఉదయం 9:30 గంటల నుండి అభ్యర్థుల బయోమెట్రిక్ విధానం ప్రారంభమవుతుందని, అందువల్ల తప్పనిసరిగా బయోమెట్రిక్ తీసుకోవాలని, బయోమెట్రిక్ వేయని, ఓఎంఆర్ ఆన్సర్ సీటును అప్పగించిన అభ్యర్థుల ఓఎంఆర్ ల ఆన్సర్ మూల్యాంకనం చేయడం జరగదన్నారు.అలాగే పరీక్ష రాసే అభ్యర్థులు మెహేంది ధరించవద్దని,తాత్కాలిక టాటూస్,అభ్యంతరకరమైన మెటీరియల్ ను ధరించడం వంటివి చేయకూడదన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్బి డిఎస్పీ రమేష్,రిజనల్ కో ఆర్డినేటర్ ఉపేందర్,చీప్ సూపర్డెంట్లు,బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు మరియు ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News