మన శరీరానికి ఆహారం, గాలి ఎంత అవసరమో నిద్ర( sleep ) కూడా అంతే అవసరం.నిద్ర మన శరీరం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.
రెండు రోజులు నిద్రపోకపోతే ఎంత బలవంతుడైన బలహీనంగా మారిపోతాడు.అందుకే కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలని నిపుణులు పదే పదే చెబుతుంటారు.
అయితే ఇటీవల కాలంలో జీవనశైలి, ఒత్తిడి, డిప్రెషన్, తదితర కారణాల వల్ల ఎంతో మంది నిద్రలేమికి గురవుతున్నారు.నిద్రలేమి వల్ల తలెత్తే సమస్యల్లో డార్క్ సర్కిల్స్( Dark circles ) ఒకటి.
సరైన నిద్ర లేకపోవడం వల్ల చాలా మందికి కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ వస్తుంటాయి.
నిద్రలేమి నుంచి బయటపడిన కూడా చాలా మందికి డార్క్ సర్కిల్స్ మాత్రం అలానే ఉండిపోతాయి.
వాటిని తగ్గించుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీకు చాలా బాగా సహాయపడుతుంది.ఈ రెమెడీని కనుక పాటిస్తే వారంలో కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలు మాయం అవుతాయి.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఎనిమిది ఎండు ద్రాక్ష( Raisins ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న ఎండు ద్రాక్షను వాటర్ తో సహా వేసుకోవాలి.అలాగే మూడు యాపిల్ స్లైసెస్( Apple slices ) కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ తేనె ( honey )మరియు వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ మాత్రమే కాకుండా ముఖం మొత్తానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ మాస్క్ వేసుకోవడం వల్ల కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలు క్రమంగా మాయమవుతాయి.అలాగే ఈ మాస్క్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
ముడతలను తగ్గిస్తుంది.మచ్చలు తరిమి కొడుతుంది.
ముఖాన్ని అందంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.