వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.షర్మిల ఏపీ మనిషన్న రేవంత్ రెడ్డి తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ వాళ్లు పరిపాలించుకోవడానికి అని తెలిపారు.
షర్మిల వచ్చి తెలంగాణకి నాయకత్వం వహిస్తా అంటే ఊరుకుంటామా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.రేవంత్ ఉన్నన్ని రోజులు వేరే రాష్ట్రం వాళ్లు తెలంగాణకి నాయకత్వం వహించరని చెప్పారు.
ఒకవేళ షర్మిల ఏపీ కాంగ్రెస్ కు పని చేస్తే స్వాగతిస్తానన్నారు.షర్మిల ఏపీసీసీ చీఫ్ అయితే సహచర పీసీసీ చీఫ్ గా ఆమెని కలుస్తానని పేర్కొన్నారు.
అంతేకానీ తాను పీసీసీ చీఫ్ గా ఉన్నన్ని రోజులు షర్మిల నాయకత్వం తెలంగాణలో ఉండదని స్పష్టం చేశారు.షర్మిల తెలంగాణకి నాయకత్వం వహిస్తా అంటే అది తెలంగాణ అస్తిత్వాన్ని కించపరచడం అవుతుందని విమర్శించారు.