జనసేనకు 'భీమవరం' భయం పట్టుకుందా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరి జిల్లా ఆ పార్టీకి కాంచోకోటలా ఉంటుందని అంతా భావించారు.జనసేన ప్రభావం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని అంతా భావించారు.

 Tough Competition For Janasena In Bheemavaram-TeluguStop.com

ఆ ప్రభావం అలా ఉండాలనే పవన్ కూడా భీమవరం నుంచి అసెంబ్లీ బరిలోకి దిగాడు.తన అన్న నాగబాబు ని కూడా నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దించాడు.

మొదట్లో ఈ రెండు నియోజకవర్గాల్లో గెలుపు పక్క అని అంతా భావించారు.కానీ రాను రాను ఆ ఆశలు సన్నగిల్లుతూ వస్తున్నాయి.

ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో పవన్ కి ఎదురుగాలి వీస్తున్నట్టు అనేక సర్వేల ద్వారా తేలడంతో గెలుపుపై పవన్ కి భయం పట్టుకున్నట్టు పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది.

అదీ కాకుండా ఇక్కడ టీడీపీ-వైసీపీ అభ్యర్ధులు ఇద్దరూ బలమైన వారు కావడంతో పవన్ గెలుపుపై సందేహాలు వస్తున్నాయి.

టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ఇప్పటికే రెండు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచారు.ఈ సారి కూడా గెలుపు తనదేననే ధీమాలో ఉన్నారు.గత ఎన్నికల్లో ఓడిపోయి కసి మీదున్న వైసీపీ అభ్యర్ధి గ్రంథి శ్రీనివాస్ ఈసారి ఎలా అయినా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.ఇక ఈ ముగ్గురి పోటీతో భీమవరంలో ఎలా ఉండబోతుంది అనే విషయంలో అందరికీ ఉత్కంఠ రేపుతూనే ఉంది.

మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న పవన్ అన్నిరకాల లెక్కలు వేసుకుని మరీ రంగంలోకి దిగాడు.

ఇక్కడ కాపు ఓటర్లు, మెగా అభిమానులు ఎక్కువ పవన్‌కి కలిసొచ్చే అంశం.అయితే ప్రజారాజ్యం ద్వారా ఎదురైన అనుభవాలు దృష్ట్యా కాపులు అందరూ జనసేనకి మద్ధతు ఇవ్వడం కష్టమే.పైగా పవన్ వెనుక 35 ఏళ్ళలోపు ఉన్న వారంతా ఎక్కువ కనిపిస్తున్నారు.

ఆఖరుకి పవన్‌ సభల్లోనూ వీరి హాజరే ఎక్కువ.ఇక వీరిలో 15-20 ఏళ్ళు లోపు వారు కూడా ఎక్కువ ఉన్నారు.

టీడీపీ సిట్టింగ్ ఎమ్యెల్యే రామన్జనేయులకు కాపు సామజిక వర్గం మద్దతు ఎక్కువ గా ఉండే అవకాశం కనిపిస్తోంది.దీనికి తోడు ఇక్కడ ఆర్ధికంగా, సామాజికంగా బలమైన వర్గంగా ఉన్న క్షత్రియుల మద్దతు కూడా అంజిబాబు కే ఉన్నట్టు వార్తలు వస్తుండడంతో పవన్ కి గెలుపుపై సందేహాలు పెరిగినట్టు తెలుస్తోంది.

ఇక ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నముగ్గురు అభ్యర్ధులు కాపు సామాజికవర్గ నేతలే.
ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా 70 వేల వరకు ఉన్నాయి.

ముగ్గురు అభ్యర్ధులు కాపు సామాజికవర్గ నేతలే.దీంతో కాపు ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube