న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాలను సెనా దేశాలు( SENA Countries ) అంటారు.ఈ నాలుగు దేశాల్లో మన భారత బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు.ఈ నాలుగు దేశాల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసుకున్న టాప్-5 భారత బౌలర్లు ఎవరో తెలుసుకుందాం.
కపిల్ దేవ్:
భారత జట్టు మాజీ పేసర్ కపిల్ దేవ్( Kapil Dev ) సేనా దేశాల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన భారత జట్టు బౌలర్లలో అగ్రస్థానంలో నిలిచాడు.ఇతను ఎనిమిది సార్లు ఏకంగా ఐదు వికెట్లు తీశాడు.ఆస్ట్రేలియా జట్టుపై ఐదుసార్లు, ఇంగ్లాండ్ జట్టుపై మూడుసార్లు ఐదు వికెట్లు సాధించాడు.
ఇక న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాలపై కపిల్ దేవ్ ఐదు వికెట్లు పడగొట్టలేదు.సెనా దేశాలతో 114 మ్యాచులు ఆడి 211 వికెట్లు తీశాడు.
జస్ప్రిత్ బుమ్రా:
భారత జట్టు పేసర్ జస్ప్రిత్ బుమ్రా( Jasprit Bumrah ) ఏడుసార్లు ఐదు వికెట్లు తీసి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లపై మూడుసార్లు, ఆస్ట్రేలియా జట్టుపై ఒకసారి ఐదు వికెట్లు సాధించాడు.సైనా దేశాలతో 96 మ్యాచులు ఆడి 179 వికెట్లు తీశాడు.
అనిల్ కుంబ్లే:
భారత జట్టు మాజీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే( Anil Kumble ) ఆరుసార్లు ఐదు వికెట్లు తీసి ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచాడు.ఆస్ట్రేలియా జట్టుపై నాలుగుసార్లు, దక్షిణాఫ్రికా జట్టుపై ఒకసారి, న్యూజిలాండ్ జట్టుపై ఒకసారి ఐదు వికెట్లు సాధించాడు.సెనా దేశాలతో 109 మ్యాచులు ఆడి 2019 వికెట్లు తీశాడు.
జహీర్ ఖాన్:
భారత జట్టు మాజీ పేసర్ జహీర్ ఖాన్( Zaheer Khan ) ఆరుసార్లు ఐదు వికెట్లు తీసి ఈ జాబితాలో నాలుగవ స్థానంలో నిలిచాడు.న్యూజిలాండ్ జట్టుపై నాలుగు సార్లు, ఇంగ్లాండ్ జట్టుపై ఒకసారి, ఆస్ట్రేలియా జట్టుపై ఒకసారి ఐదు వికెట్లు సాధించాడు.సెనా దేశాలతో 86 మ్యాచులు వాడి 198 వికెట్లు తీశాడు.
భగవత్ చంద్రశేఖర్:
భారత జట్టు మాజీ రైట్ ఆర్మ్ స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్ ఆరుసార్లు ఐదు వికెట్లు తీసి ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచాడు.భగవత్ చంద్రశేఖర్ 1964 నుండి 1979 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.