సినిమాలోని హీరో హీరోయిన్ లా మధ్య వచ్చే కథపై ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.అంతేకాకుండా వారి పాత్రల మధ్య జరిగే సన్నివేశాలు కేవలం ఆకట్టుకుంటాయి.
కానీ హీరోయిన్ చుట్టూ తిరిగి లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో వచ్చే కథలు మాత్రం ప్రేక్షకుల మనసులను దోచుకుంటాయి.లేడీ ఓరియెంటెడ్ కథల పట్ల ఇండస్ట్రీకి కూడా గట్టి పోటీ ఉంటుంది.
ఇప్పటికే తెలుగు సినిమాలలో లేడీ ఓరియెంటెడ్ కి సంబంధించిన కథలు చాలానే తెరకెక్కాయి.కానీ ఇప్పుడు అంతగా రావట్లేవు పైగా లేడీ ఓరియెంటెడ్ కథ పాత్ర కు తగ్గట్టుగా హీరోయిన్స్ కూడా దొరకడం చాలా కష్టమవుతుంది.
ఇప్పటికే టాలీవుడ్ లో లేడీస్ స్టార్ హీరోయిన్స్ పలు లేడీ ఓరియంటెడ్ కథలు మెప్పించగా వారితోనే టాలీవుడ్ కి కాస్త గట్టి నమ్మకం ఏర్పడింది.ఇంతకీ వాళ్ళెవరో చూద్దాం.
విజయశాంతి :
తెలుగు సినీ సీనియర్ నటి విజయశాంతి.కెరీర్ మొదట్లో హీరోల పక్కన నటించిన విజయశాంతి ఆ తర్వాత ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కూడా బాగా మెప్పించింది.కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ, ప్రతిఘటన, వైజయంతి, శాంభవి ఐపీఎస్ వంటి సినిమాలో విజయశాంతి నటనకు అద్భుతమైన విజయం అందింది.కానీ ఇప్పుడు అలాంటి సినిమాలు కానీ అలాంటి పాత్రలో చేసే హీరోయిన్స్ కానీ దొరకడం కష్టం అవుతుంది.
అనుష్క:
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క.ఎన్నో సినిమాలలో నటించిన ఈమెకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలోనే ఎక్కువ గుర్తింపు వచ్చింది.కమర్షియల్ గా తక్కువ గుర్తింపు అందుకుంది.ఇక అరుంధతి సినిమాతో ఓ రేంజ్ లో గుర్తింపు అందుకున్న అనుష్క ఆ తర్వాత రుద్రమదేవి, భాగమతి, పంచాక్షరి, సైజ్ జీరో, నిశ్శబ్దం వంటి సినిమాలలో ఫీమేల్ ఓరియెంటెడ్ లలో బాగా నటించింది.
చార్మీ:
తెలుగు సినీ నటి ఛార్మి తన నటనకు కమర్షియల్, ఓరియంటెడ్ లలో మంచి గుర్తింపు అందుకుంది.ఇక ఈమె అనుకోకుండా ఒక రోజు, మంత్ర, మంత్ర 2, జ్యోతిలక్ష్మి వంటి పాత్రలకు ప్రాధాన్యం ఉన్న కథలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది.
నయనతార:
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈమె హీరోల సరసన నటించిన సినిమాలలో ఎంత గుర్తింపు పొందింది.కానీ లేడి ఓరియెంటెడ్ సినిమాలలో అంతగా మెప్పించలేకపోయింది.
ఈమె నటించిన అనామిక, కర్తవ్యం, అంజలి ఐపీఎస్, మయూరి, వాసుకి, కో కో కోకిల లలో నటించగా కేవలం కర్తవ్యం సినిమాతో మాత్రం మంచి గుర్తింపు అందుకుంది.
ఇలా ఒకప్పటి చాలామంది హీరోయిన్స్ ఓరియంటెడ్ సినిమాలు అలా గుర్తుండి పోగా ఈ తరం హీరోయిన్స్ కూడా లేడీ ఓరియెంటెడ్ లలో ఆసక్తి చూపుతున్నారు.
అందులో సమంత, కీర్తి సురేష్, అంజలి ఇలా పలువురు హీరోయిన్స్ నటించగా ముందు ముందు వీరితోనే ఫిమెల్ ఓరియంటెడ్ లకు గుర్తింపు ఉంటుంది.లేదంటే ఇక్కడితోనే మిగిలిపోతుంది.