సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అనుకుంటే ఖచ్చితంగా తమకంటూ ఒక యాటిట్యూడ్, స్టైల్, మేనరిజం ఉండాల్సిందే.అలా చేస్తేనే ప్రేక్షకులు వారిని గుర్తిస్తారు ఒక్కసారి ప్రేక్షకుల గుర్తింపు దక్కితే వారు ఏ స్థాయికి ఎదుగుతారో చెప్పాల్సిన అవసరం లేదు.
మన టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood Industry ) కూడా ఒక్కో స్టార్ హీరో ఒక్కో రకమైన మేనరిజం తో తమలోని యాక్టింగ్ ను చూపిస్తూ ఉంటారు.తమకంటూ స్టైల్ ఏర్పడిన వారే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా( Star Heroes ) కూడా రాణిస్తున్నారు అయితే కొంతమంది యువ హీరోలు మాత్రం సీనియర్ హీరోలను ఫాలో అవుతూ ఇండస్ట్రీలో ఎదిగారు.
మరి ఆ సీనియర్ హీరో ఎవరు ఆయనను ఫాలో అయిన కుర్ర హీరోలు ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం టాలీవుడ్ లో యూత్ లో అత్యధిక క్రేజీ ఉన్న హీరో.ఆయన ఒక్క మాట చెబితే చాలు యూత్ అంతా కూడా ఆయన మత్తులోనే ఊగిపోతూ ఉంటారు.అంతలా పవనిజం ( Pawanism ) బాగా క్లిక్ అయింది.
ఆయన మేనరిజం స్టైల్ కూడా చాలా కొత్తగా ఉండి అంతకు ముందున్న హీరోలకు భిన్నంగా ఉండడంతో ఇంత మంది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కి ఏర్పడ్డారు.సినిమాలు తగ్గించినా కూడా ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గ లేదంటే ఆయన రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే పవన్ కళ్యాణ్ ఎలా అయితే తనకంటూ భిన్నమైన స్టైల్ తో తెలుగును ఒక దుమ్ము దులిపారో ఆయనను ఫాలో అయిన కొంతమంది కుర్ర హీరోలు కూడా అలాగే స్టార్ డం నీ సంపాదించుకున్నారు.
అందులో ముందుగా చెప్పుకోవాల్సింది హీరో రామ్ పోతినేని.( Ram Pothineni ) ఎనర్జిటిక్ హీరోగా పేరు సంపాదించుకున్న రామ్ పోతినేని మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ స్టైల్ ని తన సినిమాల్లో వాడుతూ వచ్చాడు ఆయన లాగే నటిస్తూ ఉంటాడు అందుకే రామ్ ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్నాడు.అలాగే పవన్ అంటే పడి చచ్చిపోయే మరొక హీరో నితిన్.
( Hero Nithiin ) పవన్ కళ్యాణ్ ని పిచ్చిపిచ్చిగా అభిమానిస్తాడు కాబట్టి ఎప్పుడు పవన్ కళ్యాణ్ లా మారిపోయాడో తనకే తెలియదు అంటాడు నితిన్.