నటి రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె హీరోయిన్ గా కన్నా, కాంట్రవర్సి బ్యూటీగా అందరికీ సుపరిచితమే.
సోషల్ మీడియా వేదికగా ఎన్నో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్, సింహ, ధోని వంటి చిత్రాలలో నటించిన ఈమె తనకు దక్షిణాది సినిమా ఇండస్ట్రీ అంటే చిరాకు అని చెబుతూ బాలీవుడ్ వైపు వెళ్లారు.
ప్రస్తుతం అక్కడ పలు వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ గడుపుతున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.
ఇక కథల విషయంలో ఎంతో వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ ఆ పాత్ర డిమాండ్ చేస్తే నగ్నంగా నటించడానికి కూడా వెనుకాడని ఈమె ఏ విషయమైన ముక్కుసూటితనంగా నిర్మొహమాటంగా కుండ బద్దలు కొట్టినట్టు చెబుతుంటారు.తన శరీరంపై తనకు పూర్తి హక్కులు ఉన్నాయని తన శరీరం గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని ఈ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో ఎంతో బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న రాధిక ఆప్టే పెళ్లి వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనకు పెళ్లి వ్యవస్థపై నమ్మకం లేదని, తన మనసులో ఉన్న మాటను ఏమాత్రం నిర్మొహమాట పడకుండా బయట పెట్టేసారు.ఈ క్రమంలోనే పెళ్లి వ్యవస్థపై నమ్మకం లేని తను పెళ్లి ఎందుకు చేసుకున్నావ్ అనే ప్రశ్న ఎదురవడంతో కేవలం వీసా కోసం మాత్రమే తాను పెళ్లి చేసుకున్నానని తన పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ నటి బ్రిటన్ మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్‌ను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
బ్రిటన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ అతను పలు సినిమాలలో నటిస్తూ ఇండియాలోనే ఎక్కువగా ఉంటారు.వీసా రావాలంటే విదేశీ వ్యక్తులను పెళ్లి చేసుకుంటే తొందరగా వస్తుందని తెలియడంతో కేవలం వీసా కోసమే తాను పెళ్లి చేసుకున్నాననే విషయం బయట పెట్టడం ఎంతో విడ్డూరమని చెప్పవచ్చు.