టాలీవుడ్ లో సెకండ్ వేవ్ తర్వాత వరుసగా సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి.ఆగస్టు సెప్టెంబర్ నుండే పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అవుతున్నాయి.
దసరా నుండి ఆ సినిమాల సంఖ్య మరింతగా పెరిగింది.టాలీవుడ్ లో సినిమాల విడుదల జోరు చూస్తుంటే కరోనా పరిస్థితులు ఏమీ కనిపించడం లేదు.
కరోనా పూర్తిగా తగ్గినట్లుగా.ఇంతకు ముందు కరోనా ఉందా అన్నట్లుగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
సినిమాల విడుదల విషయంలో కరోనా గుర్తుకు రావడం లేదు.కాని సినిమాల వసూళ్లు మాత్రం కరోనా వల్ల ప్రభావితం అవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి.
ఇంకా జనాలు కరోనా కారణంగా థియేటర్లకు వచ్చేందుకు కాస్త భయపడుతున్నారు.కాని సినిమా బాగుంది అనే టాక్ వస్తే మాత్రం క్యూ కడుతున్నారు.
ఇంత విపత్తు సమయంలో కూడా వందల కోట్ల వసూళ్లను సినిమాలు దక్కించుకుంటున్నాయి.
కరోనా సెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ లో వారంలో రెండు మూడు సినిమా ల చొప్పున విడుదల అవుతున్నాయి.
పెద్ద మొత్తంలో విడుదల అవుతున్న సినిమాలు వసూళ్లను మీడియంగానే రాబడుతున్నాయి.సినిమాల వసూళ్ల తో సంబంధం లేకుండా వరుసగా విడుదల అవుతూనే ఉన్నాయి.రేపు శుక్రవారం కూడా మూడు సినిమాలు రాబోతున్నాయి.
కార్తికేయ హీరోగా నటించిన రాజా విక్రమార్క తో పాటు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో గా నటించిన పుష్పక విమానం కూడా రేపు విడుదల కాబోతున్నాయి.ఈ రెండు సినిమాలతో పాటు మలయాళ మూవీ కురూప్ ను కూడా తెలుగు లో విడుదల చేయబోతున్నారు.ఈ మూడు సినిమా లు తెలుగు బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టబోతున్నాయి.
పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ మూడు సినిమాలు కూడా ఏ రేంజ్ లో వసూళ్లను దక్కించుకుంటాయి అనేది చూడాలి.