ఈ మంకీ యమ స్మార్ట్ గురూ.. ఏం చేసిందో తెలుసా..?

మామూలుగా ఈ భూమి మీద ఉన్న జీవుల్లో అతి తెలివిగా ఆలోచించే జీవి మనిషి అనే విషయం తెలిసిందే.మనిషి కోతినుండి పుట్టాడు అన్నది జగమెరిగిన వాస్తవం.

 Monkey Jumping, Smart Monkey, Monkey Jumping Skill-TeluguStop.com

కొన్ని కొన్ని సార్లు మన కళ్ళ ముందు జరిగే సంఘటనలు చూస్తున్నప్పుడు ఇదే అనిపిస్తూ ఉంటుంది మనకు కూడా.ఇక్కడ ఒక కోతి చేసిన పని చూస్తే… మనుషుల కంటే తెలివైన దానిలా ప్రవర్తించింది.

ఇంతకీ కోతి ఏం చేసిందని అనుకుంటున్నారా.ఒక చెట్టుకొమ్మ పైకి ఎక్కి ఎత్తయిన గోడ పైకి దూకాలి అనుకుంది.అయితే మామూలుగా అయితే అది అసాధ్యం.కానీ కాస్త సైంటిఫికల్ గా ట్రై చేస్తే మాత్రం అది సాధ్యమవుతుంది.

ఇక్కడ ఈ కోతి ఇదే చేసి ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరిచింది.చాందిని అనే ఒక నెటిజన్ సోషల్ మీడియా ఈ కోతి తెలివి కి సంబంధించిన వీడియో పోస్ట్ చేయగా ఇది ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ఎటు నుంచో వచ్చిన కోతి అక్కడ ఉన్న చెట్టుకొమ్మ పైకి ఎక్కింది… ఇక ఆ చెట్టుకొమ్మ కి ఎంతో దూరంగా ఉన్నా పొడవాటి గోడపైకి దూకాలి అని అనుకుంది.కానీ సాధారణంగా ఆ కర్ర పైనుంచి గోడ పైకి దూకడం అసాధ్యమే.

ఈ క్రమంలోనే ఎలా అని ఆలోచిస్తున్న తరుణంలో ఆ కోతి బుర్రలో ఓ ఎక్స్లెంట్ ఐడియా తట్టింది.తాను ఎక్కి కూర్చున్న ఆ కొమ్మను అటూ ఇటూ కదపటం చేసింది.

ఇక కాసేపు గట్టిగా అలాగే చెట్టు కొమ్మను అటు ఇటు ఊపి చటుక్కున ముందు ఉన్న గోడ పైకి దూకేసింది.ఆ తర్వాత హాయిగా గోడపై నడుచుకుంటూ వెళ్ళిపోయింది.

ఇక ఈ కోతి తెలివికి అటు నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube