ఈ కధనం పూర్తిగా మందుబాబుల కోసమే.ఇది చదివితేనే మీకు కిక్కు వచ్చేస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
అవును, మీరు వున్నది నిజమే.ఈ ప్రపంచంలోనే మీరు కొనలేని మద్యం వుంది.నమ్మరంటారా? అయితే ఈ పూర్తి కధనం చదవండి.ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం ధరలు చూస్తే మీకు ఎక్కిన మైకం దిగిపోతుంది.
అయితే అలాంటి వాటి కోసం కూడా ప్రత్యేకమైన కస్టమర్లు ఉంటారు.తాగకపోయినా కనీసం బాటిల్ కొనుక్కొని వాసన చూస్తూ బతికేయాలని అనుకుంటారు కొంతమంది.
అంతేకాదు అలాంటి ఖాళీ బాటిల్ ని చూపించి తమ స్నేహితుల దగ్గర ఆ బ్రాండ్ తాగాను తెలుసా? అంటూ కంటింగ్ ఇస్తూ వుంటారు.
ఇపుడు ఆ మద్యం ప్రపంచంలోకి వెళ్ళిపోదాం.ఖరీదైన మద్యం బాటిళ్లను సాధారణ లిక్కర్‌లా కాకుండా తక్కువగా తయారు చేస్తారు.ఎక్కువ కాలం నిల్వ చేస్తారు.వరల్డ్‌లోనే వెరీ కాస్ట్లీ వైన్‌గా ఫస్ట్ ప్లేస్‌లో వున్న మద్యం పేరు ‘టేకిలా లీ.925( Tequila Ley 925 ).’ దీని ధర అక్షరాలా రూ.25 కోట్ల రూపాయలు అంటే మీరు నమ్ముతారా? కానీ నమ్మి తీరాల్సిందే.దీనిని కొనేందుకు కోటీశ్వరులు క్యూలు కడుతుంటారు.ఇక ఈ లిస్టులో రెండవది ‘హెన్రీ IV డుడోగాన్ కాగ్నాక్‘( Henri IV ) ఇది ప్రపంచంలోనే 2వ అత్యంత ఖరీదైన వైన్ గా పేరు గాంచింది.
ఈ బ్రాండ్ మద్యం ఒక్క బాటిల్ ఖరీదు అక్షరాల 56 లక్షల 93 వేల రూపాయలు.అదేవిధంగా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన మద్యం కేటగిరీలో ‘దివా వోడ్కా’ ఒకటి ఉంది.
దివా వోడ్కా ఒక్క ఫుల్ బాటిల్ ధర 7 కోట్ల 30 లక్షల రూపాయలు.
ఇదే కేటగిరికి చెందినది ‘డెల్మోర్ 62.( Dalmore 62 )’ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విస్కీగా దీనిని పిలుస్తారు.ఒక్క బాటిల్ ఖరీదు రూ.1.5 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.ఇక ప్రపంచంలోని అత్యంత ఖరీదైన షాంపైన్ గురించి చెప్పుకోవాలి.‘అమండా డి బ్రిగ్నాక్ మిడాస్‘ ఫస్ట్ ప్లేస్‌లో వుంది.ఈ షాంపైన్ బాటిల్ ధర దాదాపు రూ.1 కోటి 40 లక్షల రూపాయలు.అదేవిధంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెడ్ వైన్ ఏదంటే ‘పెన్ఫోల్డ్స్ ఆంపౌల్.’ ఈ బ్రాండ్ రెడ్ వైన్ ఒక బాటిల్ రేటు కోటి 20 లక్షల రూపాయలు.అయితే వీటిని కొనుక్కొని తాగే మందుబాబులు కూడా ఈ ప్రపంచంలో వున్నారు.