యువతరమా ఆలోచించు!

నల్లగొండ జిల్లా:మనుషులు మారాలి,మానవత్వం వర్ధిల్లాలి,అహంకారం నశించాలి,అభ్యుదయం వికసించాలి అంటూ యువతరానికి కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి ప్రజానేస్తం బోరన్న గారి నేతాజీ బహిరంగ లేఖ.

ఈ సృష్టి మనిషి ఒక్కడి సొత్తు కానే కాదని, ఇది ప్రకృతి ప్రసాదమని,84 కోట్ల జీవరాశుల్లో ఒకడైన మానవుడు ఈ సృష్టి మొత్తానికి తానే యజమాని అయినట్లు మదమెక్కిన అహంకారంతో విర్రవీగడం,మానవత్వం మర్చిపోవడం ఫలితంగానే నేటి సమాజం అనేక దుస్థితులు ఎదుర్కొంటుందని ప్రముఖ సామాజిక కార్యకర్త,ప్రజానేస్తం బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నాడు.

వీర తెలంగాణ రైతంగ సాయుధ పోరాట యోధుడు, అమరజీవి,నిరంతర శ్రామికుడు కామ్రేడ్ మున్నా లింగన్న యాదవ్ గారి అమరత్వాన్ని పురస్కరించుకొని నేడు ఒక బహిరంగ లేఖ రాస్తూ స్వార్థం,ఈర్ష, అసూయ,కులతత్వం,మతతత్వం,ప్రాంతీయతత్వం, అహంకారం,విద్వేశం నిండిన మనిషి మరొక మనిషిపై పెత్తనం చేయటం,దోచుకోవటం వంటి మానవ సమాజ నయాగిరా లాంటి దగాకోరు చర్యలు సృష్టి మునగడకే ప్రమాదాన్ని కొనితెస్తున్నాయని సామాజిక పరివర్తకుడు బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు.సృష్టిలో 84 కోట్ల జీవరాశుల్లో ఒకడైన మనిషి ఇతర జంతువుల కంటే తానే గొప్ప అని భావించి అహంకారం ప్రదర్శించడం వల్లనే సమాజంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని సుభాషన్న విశ్లేషించారు.

Think Young People!-యువతరమా ఆలోచించు-Nalgonda-Telu

జంతువులతో పోలిస్తే మనిషికి తెలివితేటల వంటి కొన్ని అదనపు సదుపాయాలు ఉండటం,దాని ఫలితంగా జ్ఞానం సంపాదించడం, జ్ఞానం ఫలితంగా ప్రకృతిపై పట్టు సంపాదించడం మూలంగా అదనపు చేకూరిన మాట వాస్తవమే అయినప్పటికీ,అంతమాత్రాన భూమి మీద మనిషి శాశ్వతుడు కాడు,దానికి అధికారుడు కాడు అనే విషయాన్ని పదేపదే నయాగిరా లాంటి ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలని నేతాజీ 9848540078 కోరారు.భూమి నాది అన్నా భూమి పక్కున నవ్వు అని వేమన వెక్కిరించిన విషయాన్ని బోరన్నగారి నేతాజీ గుర్తు చేశాడు.

నాది అనుకున్న స్థలం నిన్న ఎవరిదో, రేపు మరెవరిది కానున్నదో ఎవరు చెప్పగలరని బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు.భూమి ఉంటుంది,మనిషి ఉండడు.

Advertisement

కన్ను తెరిస్తే జననం కన్నుమూస్తే మరణం.రెప్పపాటే మనిషి జీవితం అన్న విషయాన్ని పౌర సమాజానికి బోరన్న ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మనిషిది నయాగిరా లాంటి నడమంత్రపు సిరి.మృత్యువు ముంగిట నిలబడినప్పుడు తనంత నిర్ధనుడో,ఎంతటి నిస్సహాయుడో ప్రతి మనిషి గ్రహించాలని ఈ నడమంత్రపు సిరిసంపదలన్నీ కాల మహిమ కొద్దీ ఏర్పడతాయి.

కాలం ఎప్పుడు ఒకేలా ఉండదనే విషయాన్ని గుర్తు పెట్టుకో నయాగిరా అని బోరన్నా గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 8328277285 హితువు పలికాడు.ఓడలు బండ్లయితాయి బండ్లు ఓడలవుతాయని విషయాన్ని బంట్రోతే యజమానియగును,యజమాని,బంట్రోతు అగును అనే సత్యాన్ని గుర్తుకొంచుకోవాలని అధికార మదమెక్కిన వాళ్ళు ధనాన్ని చూసి మురిసిపోతున్న నయాగిరా లాంటి ధనస్వాములు పిసినారులు ఎంగిలి చేత్తో కాకులు కొట్టడానికి భయపడే కోటాను కోటీశ్వరులైన నయాగిరా లాంటి అవినీతిపరులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని బోరాన్న ఈ సందర్భంగా నయాగిరాకు గుర్తు చేశారు.

ఆస్తులు అధికారం ఎల్లకాలం ఎవరికీ శాశ్వతం కాదని సత్యాన్ని బోరన్న గుర్తు చేశారు.స్థల,కాల,బలా బలాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవని వీటిని చూసి నయాగిరాలు మనిషికి మత్తెక్కించకుండా మనిషి జీవితం విలువలు తెలుసుకోవాలి.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
తండ్రి రైతు.. కొడుకు ఐఏఎస్.. ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!

బలవంతుడని విర్రవీగిన ఎందరో చలిచీమల చేతిలో చిక్కి చచ్చిన విషయాలను చదువుకోవాలని బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ సూచించారు.బలవంతమైన సర్పం సైతం చలి చీమల చేతుల చస్తున్న విషయాన్ని బోరన్నగారి సుభాషన్న గుర్తు చేశారు.

Advertisement

నోరు లేదు కదా అని ప్రకృతిపైన,అల్పజీవులపైన,అణగారిన వర్గాల మీదను ఆధిపత్యం చెలాయిస్తే తిరుగుబాటు తప్పదని ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడ ప్రతిఘటన ఉంటుందని విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలని యువతరానికి బోరన్న బోరన్నగారి సుభాషన్నగారు సూచించారు.ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలలో చీమలదండు గుంపులు గుంపులుగా బయలుదేరితే ప్రజలు భీతవాహనులై ఇతర ప్రాంతాలకు ప్రాణభయంతో పారిపోతున్న విషయాలను అవినీతి సామ్రాజ్యంతో సంపాదించుకున్న ఆస్తులను చూసుకొని మురిసిపోతూ పేదలను బలహీనులను అవమానపరిచే నయాగిరాలు గుర్తు చేసుకోవాలని బోరన్న గారి నేతాజీ పేర్కొన్నారు.

చీమలు పెట్టిన పుట్టలు పాములకు నెలవైనట్లుగా ఇన్నాళ్లు సురక్షిత అడవి ప్రాంతాలు సైతం మనిషి ఆక్రమణలకు వచ్చేసాయి.దాంతో వన్యప్రాణులు జనవాసాల్లోకి చొరబట్టం ఇటీవల చూస్తూనే ఉన్నాం.

ఇప్పుడు చీమల వంతు అయ్యిందని చీమలమే కదా నలిపేస్తామంటే కుదిరేదిలా లేదు.ఈ ప్రకృతి మనిషి అనుకునే అంత చేతకానిది ఏమి కాదని,ఆఖరికి చలి చీమలు సైతం బలవంతమైన పాములను ఎన్నోసార్లు చంపేసిన విషయాలను గుర్తుంచుకోవాలని విప్లవ వీరుడు బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.

కండబలంతో,ధన బలంతో,ఆయుధ బలంతో విర్రవీగిన సామ్రాజ్యవాద దేశాధిపతులందరూ సామాన్య ప్రజల సమరశీల పోరాటాల ముందు సమాధి కాక తప్పలేదని చరిత్ర చెప్పిన సత్యాన్ని చదువుకోవాలని ప్రముఖ సంఘసంస్కర్త, సామాజిక పరివర్తకుడు,కమ్యూనిస్టు పోరాట యోధుడు బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.

Latest Nalgonda News