భారీగా బీజేపీలోకి చేరికలుంటాయి:రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా:మునుగోడు మండల కేంద్రానికి చెందిన ఐదుగురు,కచలాపురం గ్రామానికి చెందిన నలుగురు కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లు హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమక్షంలో శనివారం బీజేపీలో చేరారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో భారీ స్థాయిలో చేరికలు ఉంటాయన్నారు.

కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాలిఅయిపొయింది,రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మే స్థితిలో మునుగోడు ప్రజలు లేరన్నారు.అయన అత్తాకోడళ్ళని చెప్పే కథలు ఎవరు వినరన్నారు.

There Will Be Massive Joining Of BJP: Rajagopal Reddy-భారీగా బీ�

మంత్రి జగదీష్ రెడ్డి బీజేపీలోకి రాకుండా టీఆర్ఎస్ నాయకులకు ఆశలు చూపెడుతున్నారని,అయినా వినని వాళ్ళని బెదిరిస్తున్నారని అన్నారు.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అయిందని,త్వరలో టీఆర్ఎస్ నుండి నాయకులు బీజేపీలోకి భారీ సంఖ్యలో చేరికలు ఉంటాయన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం చేసే పనులపై ప్రజలు ఎవ్వరికి నమ్మకం లేదని, ఇప్పటి వరకు అభ్యర్థినే ప్రకటించని పరిస్థితిలో ఉందన్నారు.కార్యకర్తలు కూడా కేసీఆర్ విధానాలపై తీవ్రంగా చర్చ చేస్తున్నారని,ఖచ్చితంగా బీజేపీ జెండా మునుగోడులో ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

ఈ కార్యక్రమంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి,పందుల పవిత్ర శ్రీను,శంకర్ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు.

ప్రతీ ఒక్కరికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం : సీఐ శ్రీను నాయక్
Advertisement

Latest Nalgonda News