గ్రామాల్లో వేధిస్తున్న కూలీల కొరత

నల్లగొండ జిల్లా:తెలంగాణలో వానాకాలం సీజన్ లో లక్షల ఎకరాల్లో వరి పంట సాగైయింది.వరి పంటలు గత వారం రోజుల నుంచి కోతలు మొదలైయ్యాయి.

కూలీల కొరత, పెరిగిన కూలీల ధనల కారణంగా రైతులు ఎక్కువగా హార్వెస్టర్లతోనే పంట కోయిస్తున్నారు.గతంతో పోల్చితే హార్వెస్టర్ల యజమానులు వాటి అద్ది ధరలు పెంచేశారు.ప్రస్తుత సీజనులో వరి కోతకు గంటకు రూ.2 వేల నుంచి రూ.3,500 దాకా అద్దె వసూలు చేస్తున్నారు.గతేడాది వానాకాలంతో పోల్చితే గంటకు రూ.500 నుంచి 1000 దాకా పెరిగిందని రైతులు వాపోతున్నారు.రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వరి కోతలు కోయడానికి కూలీలు దొరకడంలేదు.

మరికొన్ని ప్రాంతాల్లో కోతలకు ఒక్కో కూలి.రోజుకు రూ.500 నుంచి 800 వరకు అడుగుతున్నారు.మనుషులతో పంటను కోయిస్తే కూలీ ఖర్చు పెరగడంతోపాటు ఎక్కువ సమయం పట్టే అవకాశముండటంతో రైతులు హార్వెస్టర్లపైనే ఆధారపడుతున్నారు.

డీజిల్ ధరలు,డ్రైవర్ల జీతాలు పెరగడంతో అద్దె పెంచకతప్పలేదని యంత్రాల యజమానులు చెబుతున్నారు.సాగు చేసిన వరి పంట కోతలు ముమ్మరమయ్యాయి.కూలీల కొరత కొనతోపాటు కూలీ ధరలు అధికంగా ఉండటంతో రైతులు వరి ధర కోతలకు హార్వేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు.

Advertisement

అయితే, యజమానులు వాటి వైపు పెట్టుబడులు ధరలు పెరగడంతో తమ పరిస్థితి మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రంలోని 10 వేలకు పైగా నే హార్వెస్టర్లు కోతలు దాదాపు ఒకే సమయంలో మొదలై సుమారు 20-35 రోజుల వరకు.

కొనసాగుతాయి.రైతులు ఒక్కసారిగా కోతలు.

ప్రారంభిస్తుండటంతో డిమాండ్ పెరిగి,యంత్రాల కొరత నెలకొంటోంది.దీంతో కొందరు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి హార్వెస్టర్లను తెప్పిస్తూ అధిక ధరలకు అద్దెకు ఇస్తున్నారు.

కేవలం తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని నిడమనూర్,త్రిపురారం,అనుముల, తిరుమలగిరి(సాగర్),పెద్దపూర,గుర్రంపోడు,మాడుగులపల్లి, మిర్యాలగూడ,వేములపల్లి,దామరచర్ల,అడవిదేవులపల్లి, మండలాలలో ప్రస్తుతం ప్రతిరోజూ 70-100వరకు యంత్రాలతో వరి కోతలు సాగుతున్నాయి.వీటిలో 40-50 మాత్రమే నల్లగొండ జిల్లాకు చెందినవి.

How Modern Technology Shapes The IGaming Experience
How Modern Technology Shapes The IGaming Experience

మిగిలిన హార్వెస్టర్లు ఇతర రాష్ట్రాల నుంచి రప్పించినవి.ప్రస్తుతం రాష్ట్రంలో 10.వేలకు పైగా యంత్రాలు వరి పంటలు కోస్తున్నట్లు అంచనా వేశారు.ఒక్కో హార్వెస్టరు ధర ధర రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది.వీటి కొనుగోలు సాధారణ రైతులకు భారమే.

Advertisement

దీన్ని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం.గ్రామాల్లో యంత్రాల సేవా కేంద్రంఏర్పాటు చేసి యంత్రాలను తక్కువ అద్దెకు ఇచ్చేలా చూడాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.

గుజరాత్,మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటవుతున్నా తెలంగాణలో మాత్రం వాటి గురించి రాష్ట్ర వ్యవసాయ శాఖ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం యంత్రలక్ష్మీ పథకాన్ని నిలిపేయడంతో రైతులకు రాయితీ యంత్రాలను ఇవ్వలేకపోతున్నామని వ్యవసాయ అధికారులు వ్యాఖ్యానించారు.

Latest Nalgonda News