కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా అనేక రకాల ముఖ్యమైన పథకాలను ప్రవేశ పెడుతోంది.ఈ క్రమంలో రైతులకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు తీవ్రమైన కృషి చేస్తోంది.
ఈ కారణంగానే వారు అనేక విధాలుగా సబ్సిడీ ప్రయోజనాలను పొందగలుగుతున్నారు.ఇక ప్రస్తుతం టెక్నాలజీ సాయంతో వ్యవసాయం చేసే రైతులు ఎందరో వున్నారు.
మరికొందరు డబ్బులు లేని కారణంగా టెక్నాలజీ వాడకం అవగాహన సరిగా లేక వ్యవసాయం చేయడంలో పాతపద్ధతులే అనుసరిస్తున్నారు.అలాంటివారి కోసం ప్రభుత్వం ఓ తీపి వార్త చెప్పింది.
ముఖ్యంగా డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.దానికోసం ఓ మంచి ప్రణాళికను రూపొందించింది.విషయం ఏమంటే, రైతులు ఇకనుండి సబ్సిడీపై డ్రోన్లను సద్వినియోగం చేసుకోవచ్చు.డ్రోన్‌లను ఉపయోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందొచ్చనే విషయం తెలియంది కాదు.
రైతులను ప్రోత్సహించేందుకు దాని కొనుగోలుపై సబ్సిడీ ఇచ్చే పథకాన్ని సిద్ధం చేసింది కేంద్రం.డ్రోన్‌కు అయ్యే ఖర్చులో దాదాపు 50 శాతం సబ్సిడీ, గరిష్టంగా రూ.5 లక్షల వరకు రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించబోతోంది.
ఇక ఈ డ్రోన్ల సహాయంతో రైతులు తక్కువ సమయంలోనే పొలంలో నిలబడి పంటలపై సులభంగా ఎరువులు, ఇతర పురుగు మందులను పిచికారీ చేయవచ్చు.దీంతో రైతులకు ఎంతో సమయం ఆదా అవుతుంది.దీనితో పాటు పురుగుమందులు, మందులు, ఎరువులకు అయ్యే ఖర్చు కూడా ఆదా అవుతుంది.
దీంతో రైతులు మెరుగైన ఆదాయాన్ని పొందవచ్చు.ఈశాన్య రాష్ట్రాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు, మహిళా రైతులు, రైతులకు డ్రోన్‌ల ధరలో 50 శాతం చొప్పున గరిష్టంగా రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు.అలాగే ఇతర రైతులకు డ్రోన్‌లపై 40% లేదా గరిష్టంగా రూ.4 లక్షల వరకు సబ్సిడీ లభిస్తోంది.