ప్రపంచంలో కొన్ని వస్తువులకు మాత్రం రోజులు పెరిగేకొద్దీ వాటి విలువ అమాంతం పెరుగుతూ ఉంటుంది.ఉదాహరణకి బంగారం, వెండి, ముడిచమురు ఇలా కొన్ని వస్తువు ధరలు సంవత్సరాలు పెరిగే కొద్దీ వాటి ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
వీటితో పాటు మద్యానికి కూడా రోజులు పెరిగే కొద్దీ వాటి ధర పెరుగుతూనే ఉంటుంది.కాలం గడిచే కొద్దీ వాటి విలువ మరింతగా పెరుగుతుంది.
అయితే ఈ విషయమై ఇప్పుడు ఓ వ్యక్తి కి బాగా కలిసి వచ్చింది.తన తండ్రి ప్రతి సంవత్సరం తనకు పుట్టినరోజు సందర్భంగా మందు బాటిల్ ను గిఫ్ట్ గా ఇచ్చేవాడు.
వాటిని వెంటనే తాగకుండా ప్రతి సంవత్సరం పోగు చేసుకుంటూ వచ్చాడు సదరు యువకుడు.ఇలా దాచుకున్న మద్యం తోనే ఇప్పుడు ఆ వ్యక్తి ఒక ఇంటికి యజమాని అయ్యాడు.
వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా జరిగిన నిజమైన సంఘటన.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే….
అమెరికా దేశంలోని న్యూయార్క్ రాష్ట్రానికి చెందిన మాథ్యూ అనే వ్యక్తి 1992లో జన్మించాడు.ఇక అప్పటి నుండి ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి ఒక విస్కీ బాటిల్ ని కానుకగా ఇవ్వడం ఆనవాయితీగా మార్చుకున్నాడు.
ఇకపోతే ప్రస్తుతం మాథ్యూ కు 28 సంవత్సరాలు వచ్చాయి.ఇప్పుడు తన తండ్రి ఇచ్చిన మందు బాటిల్స్ సంఖ్య కూడా 28 చేరుకున్నాయి.అయితే తన తండ్రి ఇచ్చిన బాటిళ్లను తాను తాగి పడేయకుండా అపురూపంగా వాటిని దాచుకున్నాడు.ఇలా మొత్తం 28 బాటిళ్లను దాచుకున్నాడు.
ఇకపోతే సదరు వ్యక్తికి ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉండేది.అందుకోసం ఆ బాటిళ్లను అమ్మితే ఎంత వస్తుందా అని ఎంక్వయిరీ చేశాడు.
అయితే ఆ ఎంక్వయిరీ లో అతడికి దిమ్మతిరిగే ధరకు అమ్ముడుపోతాయని తెలిసింది.అదేమిటంటే తన తండ్రి ఇచ్చిన 28 బాటిళ్లను అప్పట్లో మొత్తం ఐదు వేల యూరోలు వెచ్చించి కొనుగోలు చేయగా, వాటి విలువ ప్రస్తుతం మార్కెట్లో ఏకంగా 40 వేల యూరోలు అనగా మన భారత కరెన్సీలో 40 లక్షలగా ఉందని తెలిసి ఆశ్చర్యపోయాడు.
ఇక ఈ విషయం తెలిసిన వెంటనే తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన మద్యం బాటిళ్లను అమ్మి తను స్వతహాగా ఇల్లు కట్టుకున్నాడు.
ఇందుకు సంబంధించి మాథ్యూ తండ్రి రాబ్సన్ మాట్లాడుతూ.
వారి సంప్రదాయం ప్రకారం ఇంట్లో పిల్లలు పుడితే విస్కీని తలకు రాసే ఆచారం ఉందని, అందుకోసం పుట్టిన సందర్భంగా ఓ బాటిల్ ని కొని అతడి తలపై విస్కీ రాశామని… ఇక అప్పటి నుండి తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఒక బాటిల్ ఇస్తూ వచ్చినట్లు తెలిపారు.అయితే మాథ్యూ కు 18 సంవత్సరాలు నిండిన తర్వాత వాటికి స్వస్తి చెబుదాం అనుకున్నా, కానీ.
మనసు అంగీకరించక పోవడంతో ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చాను అని తెలిపాడు.అయితే నిజానికి ఇలాంటి మద్యాన్ని ఎవరు వదులుకోరని, కచ్చితంగా పూర్తి చేస్తారని చెబుతూనే… తన కొడుకు ఇన్నిరోజులు అలా జాగ్రత్తగా వాటిని భద్రపరిచి దాచుకోవడం చాలా గ్రేట్ అని తెలియజేశాడు.
ఎంతైనా చాలా కాలం నాటి మందు బాటిల్ చాలా విలువైనవి గురూ…!
.