రైతుని గల్లా పట్టి గెంటేసిన ఆర్ఐ...పురుగుల మందు తాగిన రైతు

నల్లగొండ జిల్లా:తమ సమస్య చెప్పుకోడానికి వచ్చిన రైతును ఆర్ఐ( RI ) గల్లా పట్టుకొని బయటికి గెంటేయడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగిన ఘటన నల్లగొండ జిల్లా( Nalgonda District )లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలం( Gurrampode ) తెరాటిగూడెం గ్రామానికి చెందిన కసిరెడ్డి చిన మల్లారెడ్డి ఆయన సోదరుడైన రామకృష్ణారెడ్డికి భూ వివాదం నెలకొంది.

ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం చిన మల్లారెడ్డి బోరు బావిని ఆర్ఐ మురళీకృష్ణ సీజ్ చేశారు.దీంతో గురువారం తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతు తన పంట పొలాలు, తోట ఎండిపోతున్నాయని,బోరుబావిని ఎందుకు అక్రమంగా సీజ్ చేశారని ఆర్ఐ మురళీ కృష్ణని నిలదీశాడు.

The RI Who Chased The Farmer...the Farmer Drank Insecticide , RI, Farmer ,

దీనితో కోపోద్రిక్తుడైన ఆర్ఐ నీదిక్కున్నచోట చెప్పుకో అని రైతుని గల్లా పట్టి గెంటేయడంతో మనస్తాపానికి గురైన రైతు పురుగుల మందు తాగాడు.విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై శివప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని అంబులెన్స్ లో రైతుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి తరలించారు.

తండ్రి రైతు.. కొడుకు ఐఏఎస్.. ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!
Advertisement

Latest Nalgonda News