కుక్కలు, మానవులు మంచి స్నేహితులు.ఎమోషనల్ సపోర్ట్ కోసం అలాగే ప్రొటెక్షన్ కోసం చాలామంది ప్రజలు శునకాలను పెంచుతుంటారు.
ప్రేమ, మంచి హోమ్ కోసం కుక్కలు ప్రజలతో స్నేహం చేస్తుంటాయి.కుక్కలు దయగలవి, విశ్వసనీయమైనవి, అవగాహన కలిగి ఉంటాయి.
అందుకే మానవులు కుక్కలకు ఆహారం, ఆశ్రయం, రక్షణ ఇస్తారు.ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన కుక్క జాతులలో లాబ్రడార్, బీగల్, గోల్డెన్ రిట్రీవర్, పూడ్లే, పగ్( Labrador, Beagle, Golden Retriever, Poodle, Pug ) ఉన్నాయి.
కొంతమంది భయంకరంగా కనిపించే భారీ కుక్కలను పెంపుడు జంతువులుగా పెంచుతారు.ఈ కుక్కలను గార్డ్ డాగ్స్ అంటారు.
వాటిలో కొన్ని ఉదాహరణలు జర్మన్ షెపర్డ్స్, డోబెర్మాన్స్, పిట్ బుల్స్.అయితే ఇటీవల, యూకేలో ఒక పిట్ బుల్ దాని భారీ ఆకారంతో వార్తల్లో నిలుస్తూ చాలా దృష్టిని ఆకర్షిస్తోంది.
![Telugu Dog, Dog Breed, Hulk Dog, Latest, Marlon Greenan, Pit Bull-Latest News - Telugu Dog, Dog Breed, Hulk Dog, Latest, Marlon Greenan, Pit Bull-Latest News -](https://telugustop.com/wp-content/uploads/2023/10/The-height-of-this-dog-is-6-feeta.jpg)
మామూలుగానే పిట్ బుల్స్( Pit bulls ) చాలా పెద్దగా, బలమైన కుక్కలుగా ఉంటాయి.కొన్నిసార్లు అవి ప్రజలపై దాడి చేసి హాని కలిగిస్తాయి.కొన్ని చోట్ల పిట్ బుల్స్‌ను నిషేధించారు.అయితే సోషల్ మీడియాలో పాపులర్ అయిన చాలా పెద్ద పిట్ బుల్ ఉంది.యూఎస్ఎలో డాగ్ బ్రీడ్ ప్రొటెక్షన్ కోసం పనిచేస్తున్న మార్లోన్ గ్రీనన్ ( Marlon Greenan )తన వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద పిట్ బుల్ ఉందని, దానికి హల్క్ అని పేరు పెట్టినట్లు ఇటీవల వెల్లడించారు.ఈ హల్క్ డాగ్ పేరుకు తగినట్లుగానే ఇతర కుక్కలతో పోలిస్తే చాలా పెద్దగా ఉంటుంది.
ఇది ఏకంగా 80 కిలోల బరువు ఉంది.అంతేకాదు దీని ఎత్తు 6 అడుగుల పొడవు.
చాలా మంది హల్క్ పరిమాణం కారణంగా భయపడతారు.
![Telugu Dog, Dog Breed, Hulk Dog, Latest, Marlon Greenan, Pit Bull-Latest News - Telugu Dog, Dog Breed, Hulk Dog, Latest, Marlon Greenan, Pit Bull-Latest News -](https://telugustop.com/wp-content/uploads/2023/10/The-height-of-this-dog-is-6-feetc.jpg)
సాధారణంగా మానవుల్లో ఆరు అడుగుల ఎత్తు ఉంటేనే చాలా ఎత్తుగా భావిస్తుంటారు.కుక్కలు రెండు అడుగులు, మూడు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉండవు.అలాంటిది ఈ కుక్క ఏకంగా ఆరు అడుగుల ఎత్తుతో అందరికీ భయం కలిగిస్తుంది.
ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల పిట్ బుల్స్ బ్యాన్ అయ్యానని మార్లోన్ చెప్పారు.మార్కెట్లో హల్క్ విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని తెలిపారు.చాలా పిట్ బుల్స్ చట్టవిరుద్ధంగా ప్రపంచవ్యాప్తంగా పంపబడుతున్నాయి.
పిట్ బుల్స్ గతంలో చిన్న పిల్లలను బాధపెట్టినందున యూకే నిషేధించింది.