కొలెస్ట్రాల్.ఇది రెండు రకాలు.ఒకటి మంచి కొలెస్ట్రాల్ అయితే.రెండొవది చెడు కొలెస్ట్రాల్.మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్ అంటే.చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్‌డిఎల్ అంటారు.
అయితే మంచి కొలెస్ట్రాల్ తో ఎటువంటి సమస్యలేదు.కానీ, బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ గుండె కు ముప్పు పెరిగి పోతూ ఉంటుంది.
గుండె పోటు తో సహా వివిధ రకాల గుండె జబ్బులు వచ్చే రిస్క్ అధికమవుతుంది.
అందుకే బాడీలో పెరిగిన కొలెస్ట్రాల్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ ఉండాలి.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే మూడు ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.ఈ ఆహారాలను డైట్ లో చేర్చుకుంటే కొలెస్ట్రాల్ కరుగుతుంది.
అదే సమయంలో గుండె ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది.మరి ఇంతకీ బాడీలో కొలెస్ట్రాల్ ను కరిగించే ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
బాడీలో హై కొలెస్ట్రాల్ ను కరిగించడంలో నట్స్ గ్రేట్ గా సహాయపడతాయి.ముఖ్యంగా బాదం, వాల్ నట్స్ వంటి వాటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
దాంతో గుండె పని తీరు మెరుగుపడటమే కాదు వివిధ రకాల గుండె సంబంధిత జబ్బులు దరిదాపుల్లోకి రాకుండా కూడా ఉంటాయి.

అలాగే కొలెస్ట్రాల్ ను కరిగించుకోవాలనుకునే వారు తప్పకుండా తమ డైట్ లో తృణధాన్యాలను చేర్చుకోవాలి.ఓట్స్, బార్లీ, బ్రౌన్ రైస్, వీట్ తదితర తృణధాన్యాలు డైట్ లో చేర్చుకుంటే వాటిలో ఉండే ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఇక ఆపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీస్ మరియు సిట్రస్ పండ్లు కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి సూపర్‌గా హెల్ప్ చేస్తాయి.ఈ పండ్లను డైట్ లో కనుక చేర్చుకుంటే వివిధ రకాల గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.కాబట్టి తప్పకుండా పైన చెప్పుకున్న ఆహారాలు డైట్ లో భాగం చేసుకునేందుకు ప్రయత్నించండి.







