తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి పంపిన లేఖపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు.ప్రభుత్వానికి గవర్నర్ నుంచి లేఖ అందిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసైను కలవమని సర్కార్ తనకు ఆదేశాలు ఇచ్చిందని మంత్రి సబితా వెల్లడించారు.అయితే గవర్నర్ అపాయింట్ మెంట్ ఇంకా ఖరారు కాలేదని ఆమె పేర్కొన్నారు.
గవర్నర్ ఎప్పుడు టైమ్ ఇస్తే అప్పుడు కలుస్తామని చెప్పారు.అపాయింట్ మెంట్ ఇవ్వగానే కలిసి సందేహాలు నివృత్తి చేస్తామని స్పష్టం చేశారు.







