సర్జరీకోసం వెళ్లిన నటికి షాకిచ్చిన వైద్యుడు.. !

అందంగా కనిపించి నలుగురి మెప్పు పొందాలని ఎవరికి ఉండదు చెప్పండి.అయితే ఆ అందం మీద ఉన్న మోజు ఒక్కోసారి చిక్కులు తెచ్చిపెడుతుంది.

 The-doctor Who Shocked-the-actress Who Went For Surgery Chinese Actress, Singer-TeluguStop.com

అందంగా కనిపించాలనే ఆరాటం వల్ల ఉన్న అందానికే ఎసరు వస్తుంది.ఇలా చైనా నటి, సింగర్‌ గావో లియూ విషయంలో జరిగింది.

ఈమెకు తన అందం మీద ఉన్న మక్కువ వల్ల జరిగిన నష్టం గురించి తెలుసుకుంటే.చైనా నటి, సింగర్‌ అయిన లియూ తన ముక్కును ట్రిమ్‌ చేయించుకోవాలని గువాంగ్జూలో గల ఓ ప్లాస్టిక్‌ సర్జన్‌ను కలిసిందట.

అతను కూడా ఈ నటికి సర్జరీ చేయడానికి అంగీకరించి తనపని తాను చేశాడట.

అయితే, సర్జరీ తర్వాత ఆమె ముక్కు చివర చర్మం పూర్తిగా నల్లగా మారిపోయింది.

అందులోని కణజాలం పూర్తిగా దెబ్బతిన్నది.మొత్తానికి అందహీనంగా మారింది.

దీంతో ఈమె చేతిలో ఉన్న అవకాశాలు కూడా చేజారిపోయాయి.

ఇలా ఏడాది పాటు ఆమె స్క్నీన్‌పై కనిపించే అవకాశం లేకుండా పోయింది.

చూశారా కొండనాలుకకి మందేస్తే ఉన్న నాలుక పోయినట్లుంది అనే సామేత గుర్తుకు వస్తుందట ఈ విషయం తెలిసిన వారికి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube