హీరోయిన్ రంభ ని భర్త ఎందుకు వదిలించుకోవాలనుకున్నాడు..?

రంభ ఈ పేరుకి పెద్ద పరిచయం అక్కర్లేదు అనుకుంట.

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకుని అందరి మనసుల్లో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు.

తన అమాయకపు చూపులతో, అందంతో, అభినయంతో కుర్రకారుని ఒక ఊపు ఊపేసింది.దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తీసిన ఆ ఒక్కటి అడక్కు సినిమా ద్వారా రంభ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.

రంభ మన విజయవాడ అమ్మాయే.రంభ అసలు పేరు విజయలక్ష్మి.

సినిమాల్లోకి వచ్చాక రంభగా తన పేరును మార్చుకుని తెలుగు చలన చిత్ర రంగాన్ని ఒక ఊపు ఊపింది.టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, తమిళ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

అందరి అగ్ర హీరోల సరసన ఆడి పాడింది.హీరోయిన్ రంభ టాలీవుడ్ లో చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి అగ్ర హీరోలందరితో ఆడిపాడింది.

 అందుకే టాలీవుడ్ లో రంభ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.దశాబ్థ కాలం పాటు లీడింగ్ లేడీగా దూసుకుపోయింది.

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాల,భోజ్ పూరి ఇలా పలు భాషల్లో నటించి అందరి అభిమానాన్ని చోరుగుంది.డాన్సుల్లో సైతం రంభకు తిరుగులేదు.జూనియర్ ఎన్టీఆర్ సరసన యమదొంగ సినిమాలో నాచోరే నాచోరే అనే పాటలో ఎన్టీఆర్ సరసన డాన్స్ ఇరగదీసింది.

అంతేకాకుండా దేశ ముదురు సినిమాలో కూడా అల్లు అర్జున్ సరసన ఆడి పాడింది.ఇంకా రంభ వైవాహిక జీవితం విషయానికి వస్తే 2010 లో ఏప్రిల్ 7 వ తారీఖున కర్ణాటక రాష్ట్రం లోని తిరుపతి కల్యాణ మండపంలో ఎన్నారై అయిన ఇంద్ర కుమార్ పద్మ నాధన్ అనే వ్యక్తితో జరిగింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఇంకా ఇంద్రకుమార్ పద్మనాధన్ ఎవరు అంటే కెనడాలోని ఒక ప్రముఖ వ్యాపారవేత్త.అంతేకాకుండా ఇతను మాజిక్ హుడ్స్ అనే కంపెనీకి అధినేత.ఇంకా ఇతను రంభను కొన్ని సినిమాల్లో చూసి ఇష్టపడ్డాడట.

Advertisement

అలా రంభను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు.వివాహం అయిన తర్వాత రంభను పెళ్లి చేసుకుని కెనడా తీసుకుని వెళ్ళాడు.

ఇంకా రంభ, ఇంద్రకుమార్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.వాళ్ళ పేర్లు లాణ్య అండ్ సాషా.

చెన్నైలోని మౌంట్ సినాయ్ ఆసుపత్రిలో రంభకు ప్రసవం జరిగింది.హీరోయిన్ రంభ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనది.

తన భర్తతో కెనడాలో సెటిలైన ఆమె పిల్లలు పుట్టిన తర్వాత కొన్నాళ్లకు మళ్లీ సినిమాల వైపు రావడానికి ప్రయత్నించారు.కానీ తిరిగి సినిమాల్లో నటించలేదు.కొంత కాలం ఆమె తమిళ టీవీ కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరించారు.

అయితే సడెన్ గా రంభ తన పిల్లలతో కలిసి ఇండియా వచ్చేసింది.కారణం ఏంటంటే 2017 లో రంభ, ఇంద్ర వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి.

అదనపు కట్నం కావాలని వీళ్ళ మధ్య విభేదాలు తలెత్తాయి.అలాగే తన మ్యాజిక్ హుడ్స్ కంపనికి రంభని ఒక మోడల్ గా వాడుకున్నాడు ఇంద్రకుమార్ అని కేసు కూడా పెట్టింది.ఒకానొక సమయంలో విడిపోదామని నిర్ణయించుకుని విడాకుల కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కారు.

విడాకులు సరైన నిర్ణయం కాదని ఈ దంపతులిద్దరూ కలసి చర్చించుకుని విభేదాలు పరిష్కరించుకున్నారు.విడాకుల కేసుని రద్దు చేసుకుని కలసి జీవిస్తున్నారు.మళ్ళీ కొన్నాళ్ళకు 2018, సెప్టెంబర్ 23 న రంభ పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడం విశేషం.

ప్రస్తుతం వీరి దాంపత్యం అన్యోన్యంగా కొనసాగుతోంది.

తాజా వార్తలు