బిగ్ బాస్ సీజన్ 6 హంగామా అప్పుడే మొదలు అయింది.ఇటీవలే ఈ బిగ్ బాస్ సీజన్ 6 సంబంధించిన గ్రాండ్ ప్రోమో కూడా విడుదల చేశారు.
ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 6 కీ కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే.ఈ షో జూన్ చివరి వారంలో లేదంటే జూలై మొదటి వారం నుంచి నుంచి ప్రసారం కానుంది.
అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన కావాల్సి ఉండగా ఇప్పటికే కంటెస్టెంట్ ల ఎంపిక కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఓటీటీ కోసం ప్రదీప్ చేసిన కొంతమందిని సీజన్ సిక్స్ కోసం రెడీగా ఉంటారట.
ఇక బిగ్ బాస్ ఓటీటీ లో టాప్ సెవెన్ కంటెస్టెంట్ లలో ఒకరు లేదా ఇద్దరు హౌస్ లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వాళ్ళు ఎవరో కాదు యాంకర్ శివ అలాగే మిత్రశర్మ లకు సీజన్ సిక్స్ లో అవకాశం కల్పించే పోతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ కీ సంబంధించిన లోగో లాంచ్ ప్రోమో విడుదల కాగా దీనిపై నెటిజన్లు స్పందిస్తూ వెయిటింగ్ ఫర్ హర్ష సాయి అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాలి కానీ టైటిల్ కొట్టడం ఖాయం అని కామెంట్లు కూడా పెడుతున్నారు.
అయితే ఫ్రీడం ని ఎక్కువగా ఇష్టపడే హర్ష సాయి మాత్రం తన ఫ్రీడమ్ ని మిస్ చేసుకోవడం ఇష్టం లేదని బిగ్ బాస్ షో కి వెళ్లే అవకాశం లేదు అంటూ తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది.హర్ష సాయి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాడా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.
మరి ఈ హర్ష సాయి ఎవరు అన్న విషయానికి వస్తే.బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ పాల్గొన్న షణ్ముఖ్ జస్వంత్ కు యూట్యూబ్ లో 4.32 మిలియన్ల మంది ఫాలోవర్స్ టాప్ లో ఉండగా, హర్ష సాయి 4.72 మిలియన్ల ఫాలోవర్లు తర్వాత నేను వెనక్కి నెట్టేసి నెంబర్ వన్ లోకి వచ్చాడు.కేవలం యూట్యూబ్ లో మాత్రమే కాకుండా ఫేస్ బుక్ ఇంస్టాగ్రామ్ లో కూడా ఇతనికి మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు.2018లో సోషల్ మీడియా లో అడుగుపెట్టిన హర్ష సాయి మూడేళ్లలోనే మిలియన్ల కొద్ది ఫాలోవర్లు రాబట్టాడు.కానీ ఇంకొందరు హర్ష సాయి అభిమానులు మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బిగ్ బాస్ హౌస్ కి రావద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నారు.