ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.45
సూర్యాస్తమయం: సాయంత్రం 06.47
రాహుకాలం: సా.3.00 ల4.30
అమృత ఘడియలు: నవమి మంచి రోజు కాదు
దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 రా.11.15 ల12.00
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీ ఆరోగ్యం కుదుట పడుతుంది.ఆదాయం కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగకండి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
వృషభం:

ఈరోజు మీరు డబ్బు సంపాదించిన కానీ అది మీ చేతి నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవడం మంచిది.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.సంతోషంగా గడుపుతారు.
మిథునం:

ఈరోజు మీరు స్నేహితులతో కలిసి చేసిన పనులు సంతోషాన్ని కలిగిస్తాయి.ఈ రోజుతో కోర్టు సమస్యలు తీరిపోతాయి.కుటుంబ సభ్యులంతా కలిసి యాత్రలకు వెళ్తారు.
అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.
కర్కాటకం:

ఈరోజు మీరు చేసే నిర్లక్ష్యం వలన కుటుంబ సభ్యులు మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరు చేసే వ్యాపారం లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.మీరు ఎంత కష్టపడినా మీ శ్రమకు తగిన ఫలితం దక్కదు.కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి.
సింహం:

ఈరోజు మీరు సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యుల సలహాలతో ఏ పని మొదలు పెట్టినా త్వరగా పూర్తవుతుంది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు సమయానికి మీ చేతికి అందుతుంది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కన్య:

ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.స్నేహితుల వలన కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడం మంచిది.ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టేముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చించడం మంచిది.
తులా:

ఈరోజు మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి.ఏ పని మొదలు పెట్టినా త్వరగా పూర్తవుతుంది.సరైన సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి మీ చేతికందుతుంది.దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
వృశ్చికం:

రోజు మీరు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.లేదంటే ఆరోగ్య సమస్యలతో బాధపడతారు.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.జీవిత భాగస్వామితో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.
ధనస్సు:

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వీరంతా కలిసి యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.వెళ్లిన చోట మీ ఆదాయం కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
మకరం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన నిదానంగా పూర్తవుతుంది.జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.కొందరు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
వారితో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.మీరంటే గిట్టనివారికి దూరంగా ఉండడం మంచిది.
కుంభం:

ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.స్నేహితుల వలన కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.ఇరుగుపొరుగు వారితో అనవసరంగా వాదనలకు దిగకండి.మీరంటే గిట్టనివారు మనశ్శాంతి కోల్పోయేలా చేశారు.
మీనం:

ఈరోజు మీరు కొత్త వ్యాపారం మొదలు పెడతారు.వ్యాపారంలో అధిక లాభాలు అందుకుంటారు.ఎంత ఆదాయం వచ్చినా ఏదో తెలియని బాధ మీ మనసులో ఉండి పోతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.పిల్లలతో చాలా సంతోషంగా ఉంటారు.