అమెరికాలో సంక్రాంతి పోటీలు...!!!

సంక్రాంతి అంటే అచ్చతెలుగు పండుగ.ఈ పండుగ కోసం దేశవిదేశాలలో ఉన్న తెలుగు వారందరూ వారి వారి సొంత ఊళ్ళకి పయనమవుతారు.

 Telugu Association Of Central Ohio Sankranthi Festivals-TeluguStop.com

సంక్రాంతి ముగ్గులు, కొత్త అల్లుళ్ళు, గంగిరెద్దులు, గొబ్బెమ్మలతో ఎంతో అంగరంగ వైభవంగా కోలాహరంగా మారుతాయి తెలుగు లోగిళ్ళు.అయితే ఈ పండుగ నాడు తమ సొంత గ్రామాలకి రాలేని విదేశాలలో ఉండే ఎన్నారైలు అందరూ అక్కడే స్థానికంగా సంక్రాంతి వేడుకలని ఘనంగా నిర్వహించుకుంటారు.

ఈ క్రమంలోనే అమెరికాలోని తెలుగు సంఘాలలో ఒకటైన సెంట్రల్ ఒహియో తెలుగు సంఘం సంక్రాంతి పోటీలు నిర్వహిస్తూ వేడుకలకి ఏర్పాట్లు చేస్తోంది.జనవరి 11 న నార్త్ వెస్ట్ చాపెల్ గ్రేస్ బ్రెత్రేన్ లో ఈ వేడుకలని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

అందుకు తగ్గట్లుగా బ్రోచర్ కూడా విడుదల చేసింది.ముగ్గుల పోటీలు, గాలిపటాలు,కోలాటం వంటి వివిధ సంక్రాంతి ఆటలు నిర్వహిస్తూ తెలుగు వారిమధ్య ఆహ్లాదకరమైన పోటీని ఏర్పాటు చేస్తోంది.

Telugu Telugucentral, Telugu Nri Ups-

ఈ పోటీలలో పిల్లలు పెద్దలు ఎవరైనా సరే పాల్గొన వచ్చని తెలిపింది.అయితే ముగ్గుల పోటీలలో చిన్నా పెద్దా కూడా పాల్గొనవచ్చని, గాలిపటాల పోటీలలో కేవలం 15 ఏళ్ళ లోపు వారు మాత్రమే పోటీలలో పాల్గొనాలని తెలిపింది.కోలాటం లో ఆరుగురు కలిసి గ్రూప్ గా పేర్లు ఇవ్వాలని తెలిపింది.అందుకు గాను ప్రవేశ రుసుము కూడా ప్రకటించింది.ఈ వేడులకలో పోటీ చేసేందుకు తెలుగువారందరూ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని సంస్థ నిర్వాహకులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube