నా కూతురి పెళ్లి నేను చెయ్యను.. కానీ పిలిస్తే వెళతా....

Telugu Actor Prakash Raj About His Daughter Marriage

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్ని వందల కుపైగా చిత్రాలలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించినటువంటి తెలుగు ప్రముఖ విలక్షణ నటుడు “ప్రకాష్ రాజ్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు ప్రకాష్ రాజ్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ప్రజలకి మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా పార్టీ స్థాపించాడు.

 Telugu Actor Prakash Raj About His Daughter Marriage-TeluguStop.com

ఈ క్రమంలో గత ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికలలో పోటీ కూడా చేశాడు.కానీ దురదృష్టవశాత్తు ఓటమిపాలయ్యాడు.

అయినప్పటికీ ప్రకాష్ రాజ్ మాత్రం ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నాడు.కాగా ఇటీవలే నటుడు ప్రకాష్ రాజ్ ఓ ప్రముఖ తెలుగు వార్తా ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

 Telugu Actor Prakash Raj About His Daughter Marriage-నా కూతురి పెళ్లి నేను చెయ్యను.. కానీ పిలిస్తే వెళతా….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో భాగంగా తన కుటుంబానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా తన పెద్ద కూతురు పూజ ఇటీవలే తన చదువును పూర్తి చేసుకొని ఇండియాకి వచ్చిందని దీంతో తన సినీ కెరీర్ ని సెట్ చేసుకునే పనిలో పడిందని చెప్పుకొచ్చాడు.

అలాగే తన కూతురికి సంగీతంలో ఆసక్తి ఉందని దాంతో ఓ ప్రముఖ సంగీత దర్శకుడు దగ్గర ట్రైనింగ్ తీసుకుంటోందని తెలిపాడు.ఇటీవలే తన పెళ్లి విషయం గురించి మాట్లాడగా తనకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎన్నుకునే అవకాశం ఇచ్చానని కానీ వీరిద్దరి పెళ్లి మాత్రం తాను చేయనని కానీ పెళ్లికి కావలసిన డబ్బు ఇస్తానని అలాగే కేవలం తనని పెళ్లికి పిలిస్తే వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తానని చెప్పుకొచ్చాడు.

దాంతో తన కూతురు పూజ కూడా వెంటనే ఓకే చెప్పిందని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిందట.దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది.

అలాగే జీవితంలో పెళ్లి, చావు, పుట్టుక, మంచి జీవితం, వంటివి చాలా అవసరమని అలాంటప్పుడు ఇలాంటి ముఖ్య విషయాలలో కుటుంబ సభ్యులు సన్నిహితులు హాజరవ్వకుండా చేసుకోవడంలో అర్థం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కన్నడ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న “కేజిఎఫ్ చాప్టర్ 2” చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి కాగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

#Prakash Raj #Prakash Raj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube